5, మే 2022, గురువారం

అజిత, మొదలి పద్మ, వసంత శ్రీనివాస్ మద్దాల అభిప్రాయాలు

 అజిత 

మెడమ్ గారు నమస్కారం

బాగున్నారా మెడమ్ గారు

చాల చక్కటి అనుభవించిన అనుభవం

మీరు రాసిన ప్రతి వాక్యం సహజ సిద్ధం

అమ్మ  అమ్మే కద మీ లాంటి సాధన పట్టుదల ఉన్న వారిని తన బిడ్డలుగా తన ఒడిలో  చెర్చుకొని ఇలాంటి మహత్తర శక్తి కార్యానికి మిమ్మల్ని సిద్దపర్చడం చాల అద్భుతం

మీ రాసిన శ్రీ లలిత సహస్ర నామాల  వివరణ  ఓ తపస్సు లా ధ్యాన మార్గంలో నడిపించిది అమ్మ

నిజమే ప్రతి ఒక్కరి అభిప్రాయం చాల చాల ఆనందంగా రాసారు తమ దైన అనుభవ సరళిలో రాసారు

చిన్న పిల్లలకు సైతం అర్థం అయ్యేలా ఉంది

మీ కష్టం మీ కృషి ఏ ఒక్క నామంలో వృధా కాకుండా చాల చాల జాగ్రత్త గా శ్రీ లలితమాతయే మీ హృదయ స్పందనైన పీఠం పై కుర్చోని సహస్ర నామ వివరణ పూరించడం జరిగింది

విజయ ఫథం పై రథ యాత్ర మహోత్సవ కార్యక్రమం  జరిగేలా చేసిన  మీ సాహస ఉన్నతికి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు చాల ఆనందం మెడమ్ గారు

త్వరలో మరి యొక్క పారాయణ గ్రంథం ఆ అమ్మ సంకల్పం తో…

అజిత





ఓం శ్రీ లలితా త్రిపురసుందరీ దేవ్యై నమః  


ముందుగా ఆ లలితాపరమేశ్వరీ  స్తోత్రాలపై మీ సరళీకృత  వ్యాఖ్యానానికి అభినందనం. అభివందనం.


కొన్ని అరుదైన ఆరంభాలకు ముందు మనసు  సంశయాలకు లోను కావడం,  మనం చేయగలమా లేదా అన్న ఆందోళన వెంటాడటం సహజమే అయినా వాటన్నింటినీ మించిన తపన, భక్తిచింతన మీకు వెన్నంటి నడిపించిన అంశాలుగా పేర్కొన్నారు. ఐనా సత్సంకల్పానికి  అమ్మ వారి ఆశీస్సులు లభించక  ఆగేనా.


చరాచర జగత్తును శాసించే అమ్మవారి గురించి రాసే అవకాశం - ఆలోచన అపురూపం అమూల్యం.


భాషాడంబరం కన్నా భావసంపద మిన్నగా తొణికిసలాడే మీ వాక్యనిర్మాణం అమ్మవారి కరుణావీక్షణ కిరణమే. మీ అనుభూతి పరిమళం అమ్మవారి చరణాల అక్షరహారతిలా దేదీప్యమైంది. 


మీరు సాగించే ఈ ఆధ్యాత్మికదారిలో మరెన్నో అద్భుతాలు చేయగలిగే శక్తి ఆ అమ్మవారు మీకు అందించాలని మనసారా ఆశిస్తూ నమస్సులు.


మొదలి పద్మ


శ్రీ లలితా విజయం ఈరోజు తో పూర్తి చేశాను..అర్థం తెలియకుండా ఈ నామాలు చదివే మా లాంటి వారికి మీ విశ్లేషణ detailed వివరణ ఎంతో కొంత జ్ఞానాన్ని ఇస్తుందని నేను భావిస్తున్నాను.ఇవి ఎంత వివరంగా రాయటానికి మీరు ఎంత కృషి చేసి వుంటారో.. ఇంత వివరంగా రాయటానికి కృషి మాత్రమే సరిపోదు..అమ్మవారి అనుగ్రహం కూడా వుండాలి. ఇంత అధ్భుతం గా వ్రాసిన మీకు నా ప్రణామాలు 🙏🙏

వసంత శ్రీనివాస్ మద్దాల.