మాం పాతు మహేశ్వరీ
బాలా! పర్వతవర్దనీ! భగవతీ! బాలార్కకోటిప్రభూ!
కళ్యాణీ! నిఖిలేశ్వరీ! శుభకరీ! గౌరీ! శివా! పార్వతీ!
సర్వజ్ఞా! సకలాగమాంత వినుతా! సౌభాగ్యసంవత్ర్పరా!
దుర్గాంబా! నవకోటి మూర్తిసహితా! మాంపాతు మాహేశ్వరీ!
శ్రీమాతా! లలితా! ప్రసన్నవదనా! శ్రీ రాజారాజేశ్వరీ!
విష్ణు బ్రహ్మ మహేంద్ర సేవితపదా! విశ్వేశ్వరీ! శాంభవీ!
కారుణ్యామృతవాహినీ! రసమయీ! కైవల్యసంధాయినీ!
దుర్గాంబా! నవకోటి మూర్తిసహితా! మాంపాతు మాహేశ్వరీ!
హ్రీంకారీ! త్రిపురేశ్వరీ! సుఖకరీ! మాతాన్నపూర్ణేశ్వరీ!
ఈశానీ! నవరత్న నూపురయుతా! హేమంబరోద్భాసినీ!
శ్యామా! హైమవతీ! సతీ! గుణవతీ! శ్రీ చక్రసంచారిణీ!
దుర్గాంబా! నవకోటి మూర్తిసహితా! మాంపాతు మాహేశ్వరీ!
ఆశ్వారూడ విహారిణీ! విజయునీ! కేయూరహారోజ్జలా!
శర్వాణీ! శశిసూర్యవహ్నినయనా! సౌభాగ్యసంజీవనీ!
దేవీ! జ్ఞానమయీ! చరాచరమయీ! తేజోమయీ! చిన్మయీ!
దుర్గాంబా! నవకోటి మూర్తిసహితా! మాంపాతు మాహేశ్వరీ!
మాతంగీ! శుకలాలినీ! మధుమతీ! మాణిక్యవీణాధరీ!
మహేంద్రాశ్మ సమానకాంతి కలితా! వాగ్దేవతా సేవితా!
తారానాధ కళాకలాపమకుటా! సంగీత సమ్మోదితా!
దుర్గాంబా! నవకోటి మూర్తిసహితా! మాంపాతు మాహేశ్వరీ!
వాత్సల్యామృతవర్షిణీ! గుణమణీ! వాగ్వాదినీ! హ్లాదినీ!
శబ్దబ్రహ్మమయీ! త్రిలోకజననీ! సౌందర్యమందాకినీ!
రాకా చంద్ర సహస్త్ర చారువదనా! రాజీవ మధ్యస్థితా!
దుర్గాంబా! నవకోటి మూర్తిసహితా! మాంపాతు మాహేశ్వరీ!