28, నవంబర్ 2025, శుక్రవారం

రచయిత్రి ఇతర రచనలు

 

రచయిత్రి ఇతర రచనలు 



1. శ్రీలలితావిజయం
  • Blog Address .....  https://moddeep.blogspot.com/
  • YouTube link  .....   https://www.youtube.com/watch?v=GbpVqTSN6wM&list=PLlcQJt4byZ6wk6-Hy9uqnXd7x8nMlVpKb
  • పుస్తకప్రతులకు...9885010650, 9885803015

2. ముఖే ముఖే ----- YouTube link  

https://www.youtube.com/watch?v=dSf52Q4jnJo&list=PLlcQJt4byZ6yUOSPEb2zZITI6_CjBQHD9&pp=gAQB


3. ప్రయాణోపనిషత్ -----  Blog Address ..... https://moddeep2.blogspot.com/


4. జ్ఞాపకాలదొంతర -----  Blog Address .....  http://moddeep1.blogspot.com/


5. పద్యకాదంబరి...అష్టోత్తరశతం ------  http://moddeep5.blogspot.com/

  • Blog Address .....  http://moddeep5.blogspot.com/
  • పుస్తకప్రతులకు...9885010650, 9885803015

6. ఇతర వీడియోల లింకులు ----- Go to Playlists of My YouTube Channel link  

https://youtube.com/@vijayalakshmibhattiprolu8750?si=yLm5uORdZtmge1hQ

27, నవంబర్ 2025, గురువారం

శ్రీ అంబాష్టకం --- చిన్న మంత్రపుష్పం

 శ్రీ అంబాష్టకం


అంబా శాంభవి చంద్రమౌళిరబలాఽపర్ణా ఉమా పార్వతీ
కాళీ హైమవతీ శివా త్రినయనీ కాత్యాయనీ భైరవీ
సావిత్రీ నవయౌవనా శుభకరీ సామ్రాజ్యలక్ష్మీప్రదా
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ ॥ 1 ॥

అంబా మోహిని దేవతా త్రిభువనీ ఆనందసందాయినీ
వాణీ పల్లవపాణి వేణుమురళీగానప్రియా లోలినీ
కళ్యాణీ ఉడురాజబింబవదనా ధూమ్రాక్షసంహారిణీ
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ ॥ 2 ॥

అంబా నూపురరత్నకంకణధరీ కేయూరహారావళీ
జాతీచంపకవైజయంతిలహరీ గ్రైవేయకైరాజితా
వీణావేణువినోదమండితకరా వీరాసనేసంస్థితా
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ ॥ 3 ॥

అంబా రౌద్రిణి భద్రకాళీ బగలా జ్వాలాముఖీ వైష్ణవీ
బ్రహ్మాణీ త్రిపురాంతకీ సురనుతా దేదీప్యమానోజ్జ్వలా
చాముండా శ్రితరక్షపోషజననీ దాక్షాయణీ పల్లవీ
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ ॥ 4 ॥

అంబా శూల ధనుః కుశాంకుశధరీ అర్ధేందుబింబాధరీ
వారాహీ మధుకైటభప్రశమనీ వాణీరమాసేవితా
మల్లద్యాసురమూకదైత్యమథనీ మాహేశ్వరీ అంబికా
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ ॥ 5 ॥

అంబా సృష్టవినాశపాలనకరీ ఆర్యా విసంశోభితా
గాయత్రీ ప్రణవాక్షరామృతరసః పూర్ణానుసంధీకృతా
ఓంకారీ వినుతాసుతార్చితపదా ఉద్దండదైత్యాపహా
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ ॥ 6 ॥

అంబా శాశ్వత ఆగమాదివినుతా ఆర్యా మహాదేవతా
యా బ్రహ్మాదిపిపీలికాంతజననీ యా వై జగన్మోహినీ
యా పంచప్రణవాదిరేఫజననీ యా చిత్కళామాలినీ
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ ॥ 7 ॥

అంబాపాలిత భక్తరాజదనిశం అంబాష్టకం యః పఠేత్
అంబాలోకకటాక్షవీక్ష లలితం చైశ్వర్యమవ్యాహతం
అంబా పావనమంత్రరాజపఠనాదంతే చ మోక్షప్రదా
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ ॥ 8 ॥




చిన్న మంత్రపుష్పం


లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం
దాసీ భూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం
శ్రీ మన్మంద కటాక్ష లబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం


సిద్ధలక్ష్మీ మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతీ 
శ్రీలక్ష్మీ వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా


వరాంకుశాపాశమభీతి ముద్రాం 
కరైర్వ హంతీమ్ కమలాసనస్థాం
బాలార్కకోటి ప్రతిభామ్ త్రినేత్రామ్ 
భజేహమంబాం జగదీశ్వరీమ్ తాం 


సర్వమంగళ మాంగళ్యే  శివే సర్వార్థ సాధికే 
శరణ్యే త్య్రంబికే దేవీ నారాయణి నమోస్తుతే 


శ్రీ .......దేవతా పాదారవిందయోః సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. 






6, సెప్టెంబర్ 2025, శనివారం

సీతాపరిత్యాగం పై శ్రీమతి ముళ్లపూడి శ్రీదేవి గారి స్పందన

 సీతాపరిత్యాగం పై శ్రీమతి ముళ్లపూడి శ్రీదేవి గారి స్పందన

శ్రీ రాముడు ఆదర్శ మూర్తి. కేవలం భారతీయులకే కాదు,ప్రపంచ వ్యాప్తంగా ఆయనే అనేక మందికి  అనేక విధాల ఆదర్శం .
ఏక పత్నీ వ్రతం, పితృవాక్య పరిపాలన, సత్యవాక్పాలన, ప్రజాపరిపాలన,ధర్మస్థాపన-అన్ని విషయాలలోనూ శ్రీరాముడు ఆదర్శ పురుషుడు. రామో విగ్రహవాన్ ధర్మ:--ఒకటే మాట ఒకటే బాణం,ఒకే భార్య.
ఈ కలి యుగంలో కూడా ఇప్పటి దాకా దాదాపుగా ఈ పద్ధతే కొన సాగుతోంది. ఒకే భార్య విషయంలో. వేరే  సంప్రదాయాలను అనుసరించేవారు కూడా అవసరాలను బట్టి గాని,వీలును బట్టి గాని ఈ పద్ధతిని అనుసరించక తప్పటం లేదు.
రాముడు రాజు. ఆరోజుల్లో రాజ్యాధికారం వంశ పారంపర్యం. దశరథుడు అయోధ్య రాజు. ఆయన తర్వాత రాముడు అయోధ్య రాజు. అతని తర్వాత అతని కొడుకులు కుశలవులు రాజులు. వారి తర్వాత వారి పిల్లలు.
అలాగే ఒక స్త్రీకి ఒకే భర్త.ఒక పురుషుడికి ఒకే భార్య. ఈ నియమం త్రేతా యుగంలో రాముడి దగ్గరనుంచి ఇప్పటిదాకా ఇలాగే అనుసరించబడుతోంది. ఈ నియమానికి  విరుద్ధంగా కూడా ఈ రోజుల్లో జరుగుతూ ఉండ వచ్చు. అప్పుడు అది అక్రమ సంబంధమనీ , వివాహేతర సంబంధమనీ ప్రత్యేకంగా వేలెత్తి చూప బడుతోంది.
సరే-రాముడి పెళ్ళికి అతని వయస్సు పదహారేళ్ళు. సీతతో కూడా అయోధ్యలో రాజుగారి పెద్ద కొడుకుగా పదమూడేళ్ళు తండ్రి చాటు బిడ్డగా సుఖ భోగాలు అనుభవించాడు.
రాముడు వన వాసంలో పద్నాలుగేళ్ళు గడిపాడు.తిరిగి అయోధ్యకు వచ్చినప్పుడు   అతని వయస్సు 16+13+14 =
43. అప్పుడు పట్టాభిషేకం చేసుకుని అయోధ్యకు రాజు అయ్యాడు.
పద కొండు  వేల ఏళ్ళు రాజ్యం చేశాడు. సుమారుగా ఆ చివరి  కాలంలోనే సీతాదేవి గర్భవతి అయింది. ఆ రోజుల్లోనే సీతను గురించి, రాముడిని గురించి అయోధ్యలో అపవాదు రాముడికి తెలిసింది. రాముడు చాలా చింతించాడు. సీత పరమ పవిత్రురాలు అని తనకు తెలిసినా అపనిందకు వెరచి సీతను పరిత్యజించాడు.
అయోధ్య రాముడి పట్టమహిషి సీతాదేవి అడవిలో వాల్మీకి ఆశ్రమంలో కుశ లవులను కన్నది. ఆ పిల్లలకు పది పన్నెండేళ్ళ వయసులో అయోధ్యకు వచ్చి రాముడికి పిల్లలను అప్పగించి తను భూమిలోకి వెళ్ళిపోయింది. రాముడు ఏకపత్నీ వ్రతుడు. సీతాదేవి ఆయన భార్య. అయోధ్యకు రాజు అయ్యాక కోసల రాజ్యలక్ష్మి రాముడికి రెండవ భార్య అయింది. అప్పుడింక రాముడి ఏక పత్నీ వ్రతానికి భంగం కలిగింది.తండ్రి అప్పగించిన రాజ్య లక్ష్మిని వదలటం కుదరదు కాబట్టి, చిన్నప్పుడే పెళ్లి చేసుకుని పదకొండు వేలఏళ్ళు కాపురం చేసిన సహధర్మచారిణి  సీతాదేవిని పరిత్యజించాడు.  ఇప్పుడు రాజ్యలక్ష్మి మాత్రమే ఆయనకు భార్య. ఆయన ఏక పత్నీ వ్రతం నిలబడింది.
శ్రీరాముడి ఆదర్శాలనే ఆయన తమ్ముళ్ళూ అనుసరించారు. అనుసరించాలి కూడా. ఎందుకంటే రాముడు ఎప్పుడూ ధర్మ మార్గాన్నే అనుసరిస్తాడు కాబట్టి. రామ+అయనం- రామాయణం -రాముడి మార్గం-అనికదా. యథారాజా తథాప్రజా  కాబట్టి ప్రజలు కూడా రాముడి మార్గాన్నే అనుసరించాలి. లేకపోతే రామరాజ్యం-రాముడి ఆదర్శం అనే మాటలకు అర్థమే లేకుండా పోతుంది.
సామాన్య ప్రజలకు ఏక పత్నీ వ్రతం పెద్ద కష్టం కాక పోవచ్చు. కాస్త వివేకం, విచక్షణ ఉంటే చాలు. కాని రాజులు  -రాజ్యాలు ఏలవలసిన రాజులు -ఏకపత్నీ వ్రతులు  అవటం కష్టం.(నేను చెప్పేది తాడేపల్లి వెంకటప్పయ్య శాస్త్రి గారు సీతా పరిత్యాగానికి చెప్పిన కారణం ప్రకారం )ఎందుకంటే ఆ రోజుల్లో రాజ్యాధికారం వారసత్వం కాబట్టి  - రాజు కొడుకు రాజు కాగానే రాజ్యలక్ష్మి ఆయన భార్య అయి కూర్చుంటుంది. పెళ్లి చేసుకుంటే వ్రత భంగం అవుతుంది. పెళ్లి చేసుకోక పోతే పిల్లలు పుట్టరు. పిల్లలు పుట్టకపోతే రాజు తర్వాత రాజ్య మేలేందుకు రాజు ఏడి? రాజు పెళ్లి చేసుకోనందువల్ల రాజు వంశం వారసులు లేకుండా అయిపోతుంది. తగిన పాలకుడు లేకపోతే ఆ రాజ్యం  ఏమవుతుంది? ఆ సింహాసనం కోసం జనం కొట్టుకు చస్తారు. బలమున్న వాడిదే, డబ్బున్న వాడిదే రాజ్యం అవుతుంది(ఈ రోజుల్లోలాగానే).  ఇదంతా ఇలా ఎందుకు జరుగుతుంది అంటే -రాజు  -రాముడి లాగానే- రాజ్యలక్ష్మిని భార్యగా భావించి ఏక పత్నీ వ్రతం భంగం కాకుండా పెళ్లి చేసుకోకుండా ఉండిపోవటం వలన.
తాడేపల్లి వెంకటప్పయ్య శాస్త్రిగారు గొప్ప పండితులు,కవులు. వారి రామాయణం నేను చూడలేదు. వారికి ఈ  సీతాపరిత్యాగం  విషయంలో ఈ ఆలోచన రాకుండా ఉండి  ఉండదు. వారు చమత్కారంగా ఈ స్వారస్యం చెప్పి ఉంటారు.
ధర్మ మూర్తి రాముడు నిర్దోషి అయిన సీతాదేవిని పరిత్యజించటం న్యాయమా-అన్యాయమా అనే విషయం  త్రేతాయుగం నుంచి ఈ కలి యుగం వరకూ ఇంకా చర్చించబడటం చాలా దురదృష్టకరమైన విషయం.
రాముడు సీతను వదిలి పెట్టడం -ఏకపత్నీవ్రతం భంగం అవుతుందని కాదు- అని నా ఉద్దేశం. నాకు తోచింది ఇప్పుడు నేను రాస్తున్నాను గాని ఈ సమాధానం పెద్ద పెద్ద పండితులందరూ నిర్ణయం చేసిన విషయమే.
రాముడు పట్టాభిషేకం చేసుకున్న తర్వాత పదకొండు వేల ఏళ్ళు రాజ్యం చేశాడు.  రావణాసురుడి చెరలో సీతాదేవి పదినెలలు ఉన్న విషయం అయోధ్యలో ఇన్ని వేల ఏళ్ల నుంచి ఎప్పుడూ ప్రస్తావనకు  రాలేదా-  లేదా -అయోధ్యలో అందరూ చెప్పుకుంటున్నా ఆ  విషయం రాముడిదాకా ఎప్పుడూ రాలేదా-ఇన్ని వేల ఏళ్ల తర్వాత ఇప్పుడే రాముడి చెవిన పడిందా- ఈ అపవాదు కు రాముడు ఎలా స్పందించాలి?
రాముడు ఏకపత్నీ వ్రతం-రాజ్య లక్ష్మి -రెండో భార్య- వ్రత భంగం -ఇలా ఆలోచించలేదు. తన రాజ్యంలో ప్రజలు తన మార్గాన్నే అనుసరిస్తారు. తనది ధర్మ మార్గమైతే ప్రజలూ ధర్మమార్గాన్నే -తన మార్గాన్నే అనుసరిస్తారు.-తను చేసింది తప్పు అయితే ప్రజలూ ఆ తప్పు చేయడానికి వెనుకాడరు. ఎందుకు తప్పు చేస్తున్నారు అని అడిగే హక్కు తనకు లేదు -.ప్రజలు అధర్మ మార్గాన నడిస్తే ఆ తప్పుకి  రాజుదే బాధ్యత.
ఇప్పుడు సీతాదేవిని గురించిన అపవాదు రాజ్యమంతా వ్యాపిస్తుంది. అంతటితో ఆగదు. సీతాదేవిని రాముడు భార్యగా అంగీకరిస్తే- దశరథ మహారాజు  వరకూ నిష్కళంకమైనదిగా  పేరు ప్రతిష్ఠలు సంపాదించిన సూర్య వంశం రాముడివల్ల కళంకితం  అవుతుంది. లోకులందరూ రాముడి వైపు వేలెత్తి చూపుతారు. అది రాముడికి మరణ సదృశమే అవుతుంది.
ఆ అపఖ్యాతికి భయపడే రాముడు సీతాదేవిని పరిత్యజించాడు.అదే రాముడి కర్తవ్యం. అదే అందరికీ గౌరవం,గర్వం కూడా.
                                         ______ముళ్ళపూడి శ్రీదేవి.