25, ఏప్రిల్ 2022, సోమవారం

Book Print Infomation

అందరికీ నమస్కారం. 

చాలారోజుల నుంచీ ఎంతోమంది అడుగుతున్న శ్రీలలితావిజయం పుస్తక రూపంలో రాబోతోంది. నేను నాకోసం ఒక 500 కాపీలు వేయించుకుంటున్నాను. ఇన్నాళ్లూ చాలామంది చదువుకోవడం కోసం కానీ, పారాయణకి కానీ, పారాయణ గ్రూపుల్లో పంచుకోవడానికి గానీ, ఈ శ్రీలలితావిజయం పుస్తక రూపంలో కావాలని అడిగారు. అందుకే ఇక్కడ మీ మీ రిక్వయిర్మెంట్ ప్రకారం ప్రింట్ చేయిద్దామని మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఎందుకంటే, నేనే అన్ని పుస్తకాలూ ప్రింట్ చేయించి స్టోర్ చేయలేను. కానీ అనవసరంగా ఎక్కువ కాపీలు వేయిస్తే, పుస్తకం ప్రింట్ చేయించటం నాకు భారం అవుతుందని ఈ విధంగా చెప్తున్నాను. ఎవరికి ఎన్ని కాపీలు కావాలన్నా ఆర్డర్  చెప్పచ్చు. ఈ ప్రక్రియ అంతా పూర్తి అయ్యేసరికి జూన్ నెలాఖరు, జులై కావచ్చు. అందరికీ కావలసిన కాపీలు అన్నీ ఒకేసారి వేయిస్తే, తక్కువ ఖర్చు, తక్కువ శ్రమ అవుతాయి. మీలో ఎవరెవరికి ఎన్ని కాపీలు కావాలో నాకు ఈ ఏప్రిల్ 30 లోపల తెలియచేస్తే, నా కాపీలతో పాటు మీరు కోరినన్ని పుస్తకాలు కూడా ప్రింట్  చేయించే విధంగా ప్రింటర్ తో మాట్లాడతాను. మీలో చాలామంది మరెంతమందికో ఈ పోస్టులను ఫార్వార్డ్ చేస్తున్నారు. వారికి కూడా తెలిపి, వారి రిక్వయిర్మెంట్ కూడా నాకు తెలిపితే పని సులువు అవుతుంది. మళ్ళీ మళ్ళీ నేను వ్యయప్రయాసలకు ఓర్చి ఈ ప్రింటింగ్ పని చేయించలేను. ఒకేసారి ప్రింట్ చేయిస్తే సుమారు 400 రూపాయలలో ఒక పేపర్ బాక్ పుస్తకం తయారు అవుతుంది. పుస్తకం కొంచెం అటుఇటుగా 500 పేజీలు వస్తోంది. 

......................భట్టిప్రోలు విజయలక్ష్మి


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి