చిదగ్నికుండసంభూతా, దేవకార్యసముద్యతా ॥ 1 ॥
1. శ్రీ మాత
శ్రీమాత అంటే కేవలం శ్రీ అనే గౌరవవాచకంతో తల్లిని పిలవడం మాత్రమే కాదు.
శ్రీ అంటే లక్ష్మి, సంపద, సమృద్ధి, సంతృప్తి, ముక్తి, మోక్షం, మంత్రం, తంత్రం, యంత్రం,
ఫలం, పుష్పం.
అంతేనా, ఇంకా అష్టలక్ష్ముల రూపంతో, మనకు కావాల్సిన, ధనం, ధాన్యం, ధైర్యం, విద్య, వరాలు,
విజయం, సంతానం, వాహనాలు, సేవకులు, అభయాలు అన్నీ ఇచ్చే అపరావతారం
ఈ శ్రీమాత.
ఇంతకీ ఆ తల్లి ఎవరూ అంటే, అమ్మలగన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ,
చాల పెద్దమ్మ. మనందరికీ అమ్మ.
చిన్న దెబ్బ తగిలితే వెంటనే అసంకల్పితంగా అమ్మా.... అంటామే, ఆ అమ్మ.
అందరినీ కాపాడే అమ్మ, అందరినీ పోషించే అమ్మ, అందరినీ కాచి కటాక్షించే అమ్మ.
ఈ మాతే లోకాలన్నింటికీ మాతృస్వరూపిణి.
ఈ తల్లి కృపాకటాక్షం ఉన్నంతవరకూ లోకంలో ఎవరికీ, దేనికీ లోటన్నది ఉండనే ఉండదు.
మాతృస్వరూపిణి, ఆ శ్రీమాతకు వందనం.
ఓం శ్రీ శ్రీమాత్రేనమః
2. శ్రీమహారాజ్ఞీ
శ్రీమహారాజ్ఞీ అన్నది ఈ మాత గురించే.
ప్రప్రథమ నామం శ్రీమాతా అయితే, రెండవ నామం శ్రీమహారాజ్ఞీ.
మనల్ని, లోకాలన్నింటిని పరిపాలించే మహాశక్తి ఈ శ్రీ మహారాజ్ఞి.
కామేశ్వరుని చెంత చేరి, తన కనుసన్నలలో, తన కనుసన్నలతో
ఈ చరాచర జగత్తు నంతటినీ పరిపాలించే మహారాజ్ఞి ఈ లలితాదేవి.
సమస్త సృష్టికీ ఆధారభూతం, ఆదీ ఆమే, అంతమూ ఆమే.
సృష్టి, స్థితి, లయ అన్నీ ఆమె ఆజ్ఞ అనుసారం గానే నడుస్తున్నాయి.
ఈ సృష్టిలో ప్రతి కర్మా, కార్యమూ అన్నీ నిర్వహింపచేసే తల్లి.
ఆ తల్లి కటాక్షంతోనే ఈ సమస్త లోకాలూ సంరక్షింపబడుతూ వున్నాయి.
మహత్తరమైన పాలననూ, లాలననూ అందించే, ఆ శ్రీ మహారాజ్ఞికి వందనం.
ఓం శ్రీ శ్రీమహారాజ్ఞై నమః
3. శ్రీమత్సింహాసనేశ్వరీ
మరి అలా పరిపాలించే మహారాజ్ఞికి సింహాసనం కావద్దూ.
అదే ఆ శ్రీమత్సింహాసనం. మామూలు సింహాసనాలు ఆ శక్తికి నిలువలేవు.
అటువంటి అమేయమైన శక్తికి ఒక ప్రత్యేకమైన సింహాసనం కావాలి. అదే ఈ శ్రీమత్ సింహాసనం.
ఆ సింహాసనానికి నాలుగు కాళ్ళు, పైన పరుపు, ఆ పైన ఆనుకోవటానికి ఓ మెత్త,
సింహాసనం చేతులపై అమ్మవారు చేతులు పెట్టుకోవటానికి అటూ ఇటూ రెండు మెత్తలు.
పైన ఓ ఛత్రం. ఇన్ని హంగులతో ఉన్నది ఆ సింహాసనం.
బ్రహ్మ, గోవిందుడు, రుద్రుడు, ఈశ్వరుడు నాలుగు కాళ్లుగా వుంటూ
అమ్మవారికి పరిపాలనా కార్యక్రమంలో దోహదం చేస్తూ వుండే సింహాసనం.
సదాశివుడే పరుపై, మహేశానుడు మెత్తలయి, అన్నీ శివమయమైన ఈ సింహాసనంపై
ఆ శ్రీ మహారాజ్ఞి ఆసీనురాలయి మనలను అందరినీ చల్లగా పరిపాలిస్తుంది.
ఆ శంభువే మళ్లీ తానే కామేశ్వరుడయి, ఈ కామేశ్వరి పక్కన ఆ సింహాసనంపైనే ఆశీనుడయ్యాడు.
అంత గొప్ప సింహాసనం అది. పరమశివుడు మాత్రమే ఆ శక్తిని భరించగలడు అని చెప్పటానికి
కట్టెదుర కనిపించే ఉదాహరణం ఈ సింహాసనం.
ఆదిదంపతులే అధిరోహించిన శ్రీమత్సింహాసనం.
ఆ సింహాసనంపై కూర్చుని లోకాలన్నింటినీ పరిపాలిస్తున్న ఆ తల్లే ఈ శ్రీమత్సింహాసనేశ్వరి.
మహత్తరమైన సింహాసనం మీద ఆసీనురాలైన, ఆ శ్రీమత్సింహాసనేశ్వరికి వందనం.
ఓం శ్రీ శ్రీమత్సింహాసనేశ్వర్యై నమః
4. చిదగ్నికుండసంభూతా
చిదగ్నికుండంలో దుష్ట శిక్షణార్ధం, శిష్ట రక్షణార్థం ఆవిర్భవించిన కరుణామయి ఈమె.
భండాసురుడనే రాక్షసునిచే అరవైవేల సంవత్సరాలు పీడింపబడిన ఇంద్రాది దేవతలు
కామప్రళయంచే వేధించబడుతూ, అమ్మ రక్షణ కోరుతూ, జపాలు, తపాలు చేసి
తదనంతరం హోమం చేయడానికి ఒక హోమగుండం తవ్వి దానిలో ఆహుతిగా
వారి శరీరాలే సమిధలుగా వ్రేల్చుతుంటే, ఆ లలితామహారాజ్ఞి ఆ చిదగ్నికుండంలో
నుంచి వారికి అభయమిస్తూ ఆవిర్భవించింది.
చిత్ అంటే బుద్ధి, తెలివి, జ్ఞానం.
చిదగ్ని అంటే జ్ఞానాగ్ని. జ్ఞానాన్ని కూడా అగ్నిలో దగ్ధం చేస్తేనే కానీ అమ్మ ఆవిర్భవించదు.
అప్పుడు అమ్మ తనంతట తానే ఆ చిదగ్ని కుండం నుంచి దేవతల సంరక్షణార్ధమై వచ్చింది.
చిదగ్ని కుండంలో నుంచి ఉద్భవించిన, ఆ చిదగ్నికుండసంభూతకు వందనం.
ఓం శ్రీ చిదగ్నికుండసంభూతాయైనమః
5. దేవకార్యసముద్యతా
దేవకార్య సముద్యతా, దేవతల రక్షణార్థం, వారిని భండాసురుడు సృష్టించిన
కామప్రళయం నుంచి సముద్ధరించటం కోసం అవతరించిన మహాశక్తి ఈ దేవి.
దేవతలకైనా సరే, అభయమిచ్చేదీ, కష్టాల నుంచీ సముద్ధరించేదీ ఈ తల్లే.
అప్పటికి అరవైవేల సంవత్సరాల నుంచీ భండాసురుడిచే వేధించబడుతూ,
అమ్మని వెతుక్కుంటూ వెళ్లి, ఆ లలితాదేవికి శరణాగతి చేసిన, దేవేంద్రాదుల రక్షణభారం
తాను స్వీకరిస్తూ, దేవతలకి అభయం ఇచ్చి దేవకార్యం కోసం సన్నద్ధురాలైన
ఈ తల్లి దేవకార్య సముద్యత.
దేవకార్యార్థమై ఆవిర్భవించిన ఆ తల్లి, ఆ దేవకార్యసముద్యతకు వందనం.
ఓం శ్రీ దేవకార్యసముద్యతాయైనమః
------------భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650
వివరణ చాలా బాగుంది.
రిప్లయితొలగించండిNijanga. Vivaranga bagundi
రిప్లయితొలగించండిThank you, may I know who is this?
రిప్లయితొలగించండిExcellent visleshana Vijaya. Waiting for the next post.
రిప్లయితొలగించండిChaaalaaa baagunnaayi.
రిప్లయితొలగించండిVivarana chaalaa clear.
chala detail ga and simple words lo superb explanation aunty...
రిప్లయితొలగించండిChalabaga manassuku hattukunelagavundi Dhanyavadalu
రిప్లయితొలగించండిAssissulato girijavalla peddavadina
Peddavadina, namaste.
తొలగించండిThanks for your valuable comments.
Thanks for best explanation
రిప్లయితొలగించండి🙏 Very good explanation !
రిప్లయితొలగించండిVery clear thankyou .can I have your address and phone number
రిప్లయితొలగించండిప్రతి పోస్ట్ చివరిలో నా ఫోన్ నంబర్ కూడా పెడుతున్నానండీ.😊
రిప్లయితొలగించండి