ఓం శ్రీ హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధ్యై నమః
ఓం శ్రీ శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖపంకజాయై నమః
------------భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650
ఓం శ్రీ హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధ్యై నమః
ఓం శ్రీ శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖపంకజాయై నమః
------------భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650
కామేశ్వరాస్త్ర నిర్ధగ్ధ సభండాసుర శూన్యకా
బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవసంస్తుత వైభవా ॥ 33 ॥
82. కామేశ్వరాస్త్ర నిర్ధగ్ధ సభండాసుర శూన్యకా
ఇక భండాసురుడు, అతని శూన్యక నగరము మిగిలాయి. ఆ శూన్యక నగరము ఇప్పుడు తన పేరు
సార్ధకం చేసుకుంది. నగరం శూన్యమయింది. నగరంలో ఎవరూ లేరు, అందరూ హతులయ్యారు.
కామేశ్వరి అప్పుడు కామేశ్వరాస్త్రం సిద్ధం చేసుకుంది. భండాసురునిపై సంధించింది.
ఆ అస్త్రాగ్నిలో భండాసురుడితో పాటు, అతని శూన్యక నగరం కూడా సంపూర్తిగా దగ్ధమైపోయింది.
యుద్ధం దిగ్విజయంగా పూర్తి అయింది. దేవతాకార్యం సంపూర్ణంగా ముగిసింది.
చిదగ్నిలో నుండి వచ్చిన లలితాదేవి కామేశ్వరాస్త్రాగ్నిలో భండాసురుణ్ణి దగ్ధం చేసింది.
అజ్ఞానం నశించింది. జ్ఞానాగ్ని మిగిలింది. జీవుడు దగ్ధమైనాడు.
బూడిద నుంచి పుట్టిన భండాసురుడు తిరిగి బూడిద అయ్యాడు.
మనం ఎలా పుడతామో, అలాగే పోతాం. కానీ ఈ మధ్యలో మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము
జీవుణ్ణి మాయా మోహితుడ్ని చేసి, భ్రమయే నిజమని నమ్మిస్తూ ఉంటుంది.
అహంకారం నుంచి, క్రోధం నుంచి పుట్టిన జీవుడూ నశించాడు, అతని సామ్రాజ్యమూ నశించింది.
బంధువులు, మిత్రులు, పుత్రులు, పరివారము, సేవక బృందమూ నశించింది.
మిగిలినది ఆత్మయే. జీవుడు దాన్ని గ్రహించేలోగా జీవిత నాటకం అయిపోతూ ఉంటుంది.
అందుకే ఆ సత్యాన్ని గ్రహించేవరకూ పునరపి జననం, పునరపి మరణం.
ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది. అదే పరమాత్మ లీల.
కామేశ్వరాస్త్రంతో భండాసురుణ్ణి, అతని నగరాన్నీ కూడా సమూలంగా దగ్ధం చేసిన
ఆ కామేశ్వరాస్త్ర నిర్ధగ్ధ సభండాసుర శూన్యక కు వందనం.
ఓం శ్రీ కామేశ్వరాస్త్ర నిర్ధగ్ధ సభండాసుర శూన్యకాయై నమః
ఓం శ్రీ బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవసంస్తుత వైభవాయై నమః
------------భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650
కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతిః
మహాపాశుపతాస్త్రాగ్ని నిర్ధగ్ధాసుర సైనికా ॥ 32 ॥
80. కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతిః
ఓం శ్రీ కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృత్యై నమః
ఓం శ్రీ మహాపాశుపతాస్త్రాగ్నినిర్ధగ్ధాసురసైనికాయై నమః
------------భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650
మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షితా
భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణీ ॥ 31 ॥
78. మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షితా
చివరి ప్రయత్నంగా అమ్మవారి మీద బాణ, అస్త్ర వర్షం కురిపిస్తున్నాడు భండాసురుడు.
తల్లి మాత్రం చెడిపోయిన పిల్లవాడిని వదులుతుందా, దండించి అయినా మంచి మార్గంలో
పెడుతుంది. అమ్మ అనాయాసంగా భండాసురుని అస్త్రాలన్నింటినీ తిప్పికొట్టి తానూ అస్త్రాలని
వర్షింపచేస్తున్నది. ఆ విధంగా భండాసురుడు ప్రయోగించిన అస్త్ర, శస్త్రాలకు
ప్రత్యస్త్రాలను వర్షిస్తున్న ఆ భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణి కి వందనం.
ఓం శ్రీ భండాసురేంద్రనిర్ముక్తశస్త్రప్రత్యస్త్రవర్షిణ్యై నమః
------------భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650
విశుక్ర ప్రాణహరణ వారాహీ వీర్యనందితా
కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వరా ॥ 30 ॥
76. విశుక్ర ప్రాణహరణ వారాహీ వీర్యనందితా
తదనంతర యుద్ధంలో దండనాథ అయిన వారాహీదేవి విశుక్రుణ్ణి సంహరించింది.
విశుక్రుడు, భండాసురుని మరొక సచివుడు, సోదరుడు. ఈ సోదరుడు కూడా వారాహీదేవిచే
హతుడయ్యాడు. మహా వీర్య పరాక్రమముతో వారాహీదేవి విశుక్రుడి ప్రాణాన్ని హరించేసింది.
విశుక్రుడు శుక్రాచార్యునితో సమానమైనవాడు. తన తేజస్సును, శక్తిని
విపరీతమైన విషయములకు వాడి ద్వంద్వములో పడిపోయినవాడు.
ఆ జీవుడి ప్రాణశక్తిని హరించి, ఉద్ధరించింది వారాహీ శక్తి.
జీవుడు ఎప్పుడూ రాగము-ద్వేషము, ఆనందము-దుఃఖము, కష్టము-సుఖము
వంటి ద్వందాలలో పడి కొట్టుమిట్టాడుతూ ఉంటాడు.
ఆ స్థితిలో నుంచి జీవుడిని విముక్తుడిని చేయటానికి ఈ శక్తులు ప్రకటితమవుతూ ఉంటాయి.
విషంగ, విశుక్ర వధల వలన భండాసురుడు రెండు భుజములూ తెగినవాడై పోయాడు.
విశుక్రుడు ప్రాణాన్ని హరించిన వారాహీదేవి వీర్య శౌర్యాలకు ఆనందిస్తున్న,
ఆ విశుక్రప్రాణహరణవారాహీవీర్యనందిత కు వందనం.
ఓం శ్రీ విశుక్రప్రాణహరణవారాహీవీర్యనందితాయై నమః
ఓం శ్రీ కామేశ్వరముఖాలోకకల్పితశ్రీగణేశ్వరాయై నమః
------------భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650
అమ్మవారి హృదయము నుంచి తొమ్మిది సంవత్సరాల వయసు గల బాల పుట్టింది.
అందుకే బాల లలితాదేవి పుత్రిక. యుద్ధము ప్రారంభమయింది.
భండాసురుని సైన్యం వస్తున్నది, శక్తి సేన చేతిలో చస్తున్నది.
భండుడు తన ముప్ఫై మంది పుత్రులను ఏకకాలంలో యుద్ధానికి పంపించాడు.
బాల, భండ పుత్రులను వధించటానికి ఉద్యుక్తురాలయి, తల్లి అనుమతి కోరింది.
అమ్మ అనుజ్ఞ ఇవ్వగానే యుద్ధంలోకి దిగింది, ఆ తొమ్మిది సంవత్సరాల బాల.
తన పరాక్రమ విక్రమాలతో ఆ ముప్ఫై మంది భండాసుర పుత్రులందరినీ బాల వధించేసింది.
భండ పుత్రులంటే, జీవుని చుట్టూ అల్లుకున్న బంధాలే.
ఆ బంధాలను తొమ్మిదేళ్ల చిరుప్రాయంలో వున్న బాల సునాయాసంగా తెంచివేసింది.
బంధాలు తొలగి, స్వేచ్ఛ, విముక్తి కావాలంటే బాలను ఉపాసించాలి.
బాల ఎవరో కాదు, లలితాదేవి బాల్యరూపమే.
బాల ఎంత గొప్పగా ఆ భండాసుర పుత్రులని వధించిందో,
ఆ వివరాలన్నీ అమ్మకు అందుతున్నాయి.
తన తనయ పరాక్రమాన్ని, యుద్ధ నైపుణ్యాన్ని, భండ పుత్ర వధ విశేషాలనీ
ఎంతో ఆనందంగా వింటున్న, ఆ భండపుత్రవధోద్యుక్తబాలావిక్రమనందిత కు వందనం.
ఓం శ్రీ భండపుత్రవధోద్యుక్తబాలావిక్రమనందితాయై నమః
ఓం శ్రీ మంత్రిణ్యంబావిరచితవిషంగవధతోషితాయై నమః
ఇక్కడ ఒక పాఠాంతరమున్నది. బ్రహ్మాండ పురాణము ప్రకారము, విశుక్రుడిని మంత్రిణి
శ్యామలాదేవి వధిస్తే, దండనాథ వారాహీదేవి విషంగుణ్ణి వధించింది.
కానీ లలితాసహస్రనామముల ప్రకారము, విషంగుణ్ణి మంత్రిణి శ్యామలాదేవి వధిస్తే,
దండనాథ వారాహీదేవి విశుక్రుణ్ణి వధించింది.
ఇటువంటి మరికొన్ని భేదములను కూడా ముందు ముందు గమనించవచ్చు.
పురాణాలన్నీ వ్యాసుడే వ్రాసినా, అన్నిటికీ కొద్ది కొద్ది తేడాలున్నాయి.
ఈ మొత్తం నామాల్లో లలితాసహస్రంలో ఎలా చెప్పబడిందో,
దానిని మాత్రమే ప్రామాణికంగా తీసుకుని వ్యాఖ్యానం ఇవ్వబడింది.
ఈ బేధాలు ఎప్పుడు, ఏవిధంగా ఏర్పడ్డాయో తెలియదు.
------------భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650
భండసైన్య వధోద్యుక్త శక్తి విక్రమహర్షితా
నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుకా ॥ 28 ॥
72. భండసైన్య వధోద్యుక్త శక్తి విక్రమహర్షితా
లలితాదేవి సైన్యమంతా యుద్ధానికి ఉత్సాహంగా ముందుకు ఉరుకుతోంది.
యజ్ఞస్థలి అయిన హిమాలయ పర్వతసానువుల నుంచి, దక్షిణాపథంలో వున్న మహేంద్రగిరి
పర్వతాల వద్ద వున్న భండాసురుని రాజధాని, శూన్యకనగరానికి చేరుకుంది అమ్మ సేనావాహిని.
భండాసురుడు విషయం తెలిసినా, 'ఒక స్త్రీ, తన స్త్రీ సేనతో నా అంతటి మొనగాణ్ణి
సంహరించగలదా' అని ఉపేక్షించాడు. అమ్మ విలువ, శక్తి తెలియని సామాన్య జీవుడు, భండుడు.
అమ్మ సైన్యమంతా భండసైన్యాన్ని వధించటానికి ఎంతో రణోత్సాహంతో ఉద్యుక్తులై వున్నారు.
నకులీశ్వరి వంటి శక్తులను, వారి విక్రమాన్నీ చూసి అమ్మ హర్షం వ్యక్తం చేసింది.
జీవుడు మోహములో పడి, సంసార లంపటములో పరిభ్రమిస్తున్నపుడు,
శక్తి సేన మాత్రమే జీవుడిని ఆ బంధనాల నుంచి ఉద్ధరించగలదు.
ఏ శక్తీ పని చేయలేని చోట, స్త్రీ శక్తి అవలీలగా ఆ కార్యాన్ని సాధించగలదు.
శక్తి మహాత్మ్యం అది. ద్వంద్వాన్ని తొలగించి ఏకత్వభావనను కలిగించటమే అద్వైతము.
అప్పుడు జీవుడు, దేవుడు ఒక్కటే అనే జ్ఞానం కలుగుతుంది.
ఆ అద్వైత జ్ఞానాన్ని ఇచ్చి బంధాల నుంచి జీవుడిని విముక్తుడిని చేసేదే శక్తి.
అటువంటి శక్తి సేనలన్నీ భండ వధకు ఉద్యుక్తులై వున్నాయి.
భండాసుర సైన్యాన్ని వధించటానికి సిద్ధంగా వున్న లలితాసైన్యాన్ని చూసి హర్షిస్తున్న,
ఆ భండసైన్యవధోద్యుక్తశక్తివిక్రమహర్షిత కు వందనం.
ఓం శ్రీ భండసైన్య వధోద్యుక్త శక్తి విక్రమహర్షితాయై నమః
ఓం శ్రీ నిత్యాపరాక్రమాటోపనిరీక్షణసముత్సుకాయై నమః
------------భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650
లలిత తన అహంకారము నుంచి వారాహీదేవిని సృష్టించింది. ఈ వారాహిని తన సైన్యానికి
దండనాథగా నియమించింది. దండనాథ కిరిచక్రమనే రథమును అధిష్టించి వున్నది.
లలితాసహస్రనామస్తోత్రంలో మూడవ రథం కిరిచక్రరథం. విశాలమైనది, ఉన్నతమైనది.
కిరి అంటే వరాహము. వరాహములచే లాగబడుతున్న రథమును ఎక్కి వారాహీ దేవి
దండనాథయై అమ్మను సేవించుచున్నది అని ఈ నామానికి అర్ధం.
ఈమె లలితాసైన్యానికి దండమును ధరించి ఆదేశములను ఇస్తూ ఉంటుంది.
కిరి అంటే కిరణము అనే అర్ధం కూడా వున్నది.
ఈ కిరి చక్రము నుంచి ప్రసరించే కిరణములే, ఈ భూమండలమంతా ఆవరించి వున్నవి.
వరాహశక్తి అనగా, భూమండలమును ఉద్ధరించు శక్తి. జీవుడు మార్గము తప్పినప్పుడు,
ఈ వరాహశక్తి తన కిరణములలో జీవుని బంధించి పతనమవకుండా ఉద్ధరిస్తుంది.
దండించటానికీ, ఉద్ధరించటానికీ ఈ వరాహశక్తియే అధిదేవత.
ఈ వారాహీ దేవతను ధ్యానిస్తే, జీవుడు పతనమవకుండా కాపాడబడతాడు.
ఆత్మజ్ఞానమును పొంది సదాశివ తత్వంలో రమిస్తాడు.
కిరిచక్రమనే రథమును ఎక్కి, దండనాథ అయిన వారాహీదేవిచే పూజింపబడుతున్న
ఆ కిరిచక్రరథారూఢదండనాథాపురస్కృత కు వందనం.
ఓం శ్రీ కిరిచక్రరథారూఢదండనాథాపురస్కృతాయై నమః
ఆ జ్వాలామాలినికాక్షిప్తవహ్నిప్రాకారమధ్యగ కు వందనం.
ఓం శ్రీ జ్వాలామాలినికాక్షిప్తవహ్నిప్రాకారమధ్యగాయై నమః
------------భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650
------------భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650