పరమేశ్వరుడు, పరమేశ్వరి ఇద్దరూ పందెం వేసుకున్నారు.
పరమేశ్వరుడు రత్నములలో కెల్లా శ్రేష్టమైన తన ప్రేమరత్నమును పణంగా పెట్టాడు.
పరమేశ్వరి ఆ కామేశ్వర ప్రేమరత్నాన్ని దక్కించుకోవాలంటే
దానికి తగిన ప్రతిపణాన్ని తానూ ఒడ్డాలి.
ఆమె వెంటనే పరమేశ్వరుడికి ప్రతిపణంగా ఏమిస్తే, ఆ ప్రేమరత్నాన్ని గెలుచుకోగలదో
అటువంటి తన స్తన ద్వయాన్ని ఒడ్డింది.
దానితో అమ్మవారికి కామేశ్వరుని ప్రేమరత్నం దక్కింది.
అయ్యవారికి కామేశ్వరి స్తన రత్నాలు రెండూ దక్కాయి. ఇద్దరూ గెలిచారు.
ఇక్కడ అమ్మవారి స్తనద్వయమంటే సాధారణమైన స్తనాలు కావు.
ఆ స్తనాలు రెండూ సమస్త జగత్తునీ పోషించే నిండు పాల కుండలు.
అలాగని ఆ స్తనాలు రెండూ కురిపించేవి కేవలము క్షీరధారలూ కావు.
జ్ఞానం, విజ్ఞానం అనే ఫలాలను ఇచ్చే రెండు పూర్ణ కుంభాలు అవి.
జ్ఞాన, విజ్ఞానముల కోసం ధ్యానించవలసినది ఆ జగజ్జనని స్తనద్వయాన్ని.
జ్ఞానసంబంధర్ శిశువుగా వున్నప్పుడు అమ్మవారే స్వయంగా ఆ ద్రవిడ శిశువుకు
చన్నిచ్చి ఆకలి తీర్చిందని చెప్తారు. ఆ తరువాత ఆ జ్ఞాన విజ్ఞాన క్షీర ధారలను త్రాగిన
జ్ఞానసంబంధర్ గొప్ప కవి, భక్తుడు అయ్యాడు.
అమ్మవారి స్తన్యాన్ని గ్రోలిన అతడి జన్మ ధన్యం.
కామేశ్వరుడు ఈ పందెంలో కామేశ్వరి యొక్క స్తన ద్వయాన్ని పొందాడూ అంటే,
ఆ మధ్యలోని హృదయ కుహరములో స్థిరంగా ఉన్న కామేశ్వరి హృదయాన్ని పొందినట్టు.
ఆది దంపతులు మధ్య ఏర్పడిన ఈ ముచ్చటైన ఆ పందెం వలన,
కామేశ్వరుడికి కామేశ్వరి హృదయరత్నం దక్కితే, కామేశ్వరికి కామేశ్వరుని ప్రేమరత్నం దక్కింది.
ఈ వస్తు మార్పిడి వలన ఇద్దరూ ఆనందపడ్డారు. ఇద్దరూ గెలిచారు.
ఆ విధంగా ప్రతిపణంగా తన స్తనద్వయాన్ని ఇచ్చి కామేశ్వరుని ప్రేమరత్నాన్ని గెలుచుకున్న
ఆ కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతిపణస్తని కి వందనం.
ఓం శ్రీ కామేశ్వరప్రేమరత్నమణిప్రతిపణస్తన్యై నమః
34. నాభ్యాలవాల రోమాళి లతాఫల కుచద్వయీ
------------భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650
Om Sri Maatre Namah🙏🙏🙏🤲🤲🤲💝💖
రిప్లయితొలగించండిచాలా చక్కని వివరణ
రిప్లయితొలగించండి