కంఠాధః కటిపర్యంత మధ్యకూట స్వరూపిణీ
శక్తికూటైక తాపన్న కట్యథోభాగ ధారిణీ ॥ 35 ॥
86. కంఠాధః కటిపర్యంత మధ్యకూట స్వరూపిణీ
రెండవ కూటమైన కామరాజ కూట స్వరూపమును చెప్పే నామమిది. వాగ్భవకూటము కంఠము
వరకు ఉంటే, కామరాజ కూటము, కంఠము నుండి కటి వరకు గల స్థూల దేహ భాగముగా
వర్ణించబడింది. ఇదే అమ్మ యొక్క సూక్ష్మతర దేహము. ఈ కామరాజ కూటములో మూడు
చక్రాలుంటాయి. అవే విశుద్ధి, అనాహత, మణిపూర చక్ర పద్మాలు. పంచదశీ మంత్రములోని
మధ్యభాగములో వున్న ఆరు బీజాక్షరములను అమ్మవారి స్థూలదేహములో గల మధ్యభాగంగా
భావించండి. ఆ ఆరు బీజాక్షరములే మధ్యకూటము, హ స క హ ల హ్రీమ్.
కంఠము నుంచి మొల వరకు వున్న అమ్మవారి సూక్ష్మతర దేహాన్నే మధ్యకూటము అంటాం.
ఈ భాగానికి కామదేవుడే అధిపతి. ఈ కూటము ప్రధానముగా కామమును నెరవేరుస్తుంది.
అది ధర్మ కామమైతే దేవతా శక్తి, అధర్మ కామమైతే అసురీ శక్తి.
అయిదు బీజాక్షరములతో ముఖము, ఆరు బీజాక్షరములతో కంఠము నుంచి కటి వరకు కల
మధ్యభాగము, అమ్మ సూక్ష్మ, సూక్ష్మతర రూపాలు.
కంఠము నుంచి కింది భాగమైన కటి పర్యంతమూ మధ్యకూట స్వరూపిణిగా
దర్శనం ఇస్తున్న ఆ కంఠాధః కటిపర్యంత మధ్యకూట స్వరూపిణి కి వందనం.
ఓం శ్రీ కంఠాధః కటిపర్యంత మధ్యకూట స్వరూపిణ్యై నమః
ఓం శ్రీ శక్తికూటైక తాపన్న కట్యధోభాగ ధారిణ్యై నమః
------------భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650
, కూటముల వివరణ చాలా అద్భుతంగా ఉంది అందరికీ చాలా సులువుగా అర్థమయ్యేలా ఉంది🙏🙏
రిప్లయితొలగించండిచాలా బాగుంది
రిప్లయితొలగించండి🙏
రిప్లయితొలగించండిAdbhutha varnana madam🙏🙏🙏
రిప్లయితొలగించండి