స్వాధిష్ఠానాంబు జగతా, చతుర్వక్త్ర మనోహరా
శూలాద్యాయుధ సంపన్నా, పీతవర్ణా, అతిగర్వితా ॥ 104 ॥
504. స్వాధిష్టానాంబుజగతా
ఓం శ్రీ స్వాధిష్టానాంబుజగతాయై నమః
505. చతుర్వక్త్రమనోహరా
నాలుగు ముఖములతో మనోహరముగా వుండే దేవత ఈ స్వాధిష్టానాంబుజగతా.
నాలుగు ముఖములూ శబ్ద, స్పర్శ, రూప, రస తన్మాత్రలకు ప్రతీకలు.
జలతత్వములో, అగ్నితత్వము, వాయుతత్వమూ, ఆకాశతత్వమూ కూడా ఉంటాయి కదా.
నాలుగు ముఖములతో మనోజ్ఞముగా వున్న, ఆ చతుర్వక్త్రమనోహర కు వందనం.
ఓం శ్రీ చతుర్వక్త్రమనోహరాయై నమః
506. శూలాద్యాయుధసంపన్నా
స్వాధిష్టానాంబుజగత శూలము వంటి ఆయుధ సంపత్తి కలిగి ప్రకాశిస్తూ వున్నది.
ఆ తల్లి తన మూడు చేతులలో శూలము, పాశము, కపాలము ధరించి వున్నది.
నాలుగవ చేతితో భక్తులకు అభయ ముద్రను చూపిస్తున్నది.
శూలము వంటి గొప్ప ఆయుధ సంపత్తిని కలిగివున్న, ఆ శూలాద్యాయుధసంపన్న కు వందనం.
ఓం శ్రీ శూలాద్యాయుధసంపన్నాయై నమః
ఓం శ్రీ పీతవర్ణాయై నమః
508. అతిగర్వితా
స్వాధిష్టానాంబుజగత మహా సౌందర్యవతి, ఆ సౌందర్యాతిశయము వలన కలిగిన
గర్వముచే, అతిగర్వితయై వున్నది అని ఈ నామం చెప్తోంది.
సకల సంపదలకూ సృష్టి కర్త, అధినేత్రి, అందుకే అతిగర్వితా.
అన్నీ పొంది సంతృప్తితో వున్నది కనుక, అతిగర్వితయై వున్నది.
స్వాభిమానము కల, మహా సౌందర్యవతి యైన, ఆ అతిగర్విత కు వందనం.
ఓం శ్రీ అతిగర్వితాయై నమః
------------భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి