శాంకరీ, శ్రీకరీ, సాధ్వీ, శరచ్చంద్రనిభాననా
శాతోదరీ, శాంతిమతీ, నిరాధారా, నిరంజనా ॥ 43 ॥
126. శాంకరీ
లలితాదేవి శంకర పత్ని అగుటచే ఈ శాంకరీ అని నామము ధరించినది.
శంకరుడు అంటే శుభము, సుఖము కలిగించువాడు.
కనుక శాంకరి అంటే, శుభము, సుఖము కలిగించునది.
ఆ సుఖము కూడా సత్వ ప్రధానమయిన సుఖము, శాంతమయిన సుఖము.
నేను దక్షుని కుమార్తెగా పుట్టి శంకరుని వివాహమాడి శంకర పత్నిగా నేను శంకరుని
అన్ని సమయాలలోనూ అనుసరిస్తూ శాంకరి అను పేరు స్వీకరిస్తాను అని
ఈమె ప్రకటించినట్లు కాళికాపురాణములో వున్నది.
ఆ శంకర పత్ని, శాంకరి కి వందనం.
ఓం శ్రీ శాంకర్యై నమః
ఓం శ్రీ శ్రీకర్యై నమః
128. సాధ్వీ
సాధ్వీ అంటే పతివ్రత. ఎన్ని జన్మలెత్తినా, తనకు పతి శంకరుడే అని
స్పష్టముగా, దృఢముగా ప్రకటించిన మహా పతివ్రత పరమేశ్వరి.
పరమేశ్వరునితో అనుష్ఠానము, అధిష్ఠానం, అవస్థ, నామము, రూపము మొదలైన
పంచ సామ్యములు గల సాధ్వి ఆ పరమేశ్వరి. అందుకే ఈ ఆదిదంపతులు
ఇద్దరు కాదు ఒక్కరే కనుక అర్ధనారీశ్వరతత్వం గురించిన జ్ఞానమును పొందాలి.
అన్ని వేళలా, తన పతిని అనుసరించునది సాధ్వి. దక్షుని పుత్రి దాక్షాయణిగా జన్మించినా,
పర్వతరాజపుత్రి పార్వతిగా పుట్టినా, ఆ మహాశక్తి తన పాతివ్రత్య ధర్మము వలన,
ప్రతిసారీ కామేశ్వరుడినే భర్తగా పొందుతున్న ఆ కామేశ్వరి మహా సాధ్వి.
ఈ ప్రత్యేకత కేవలము అమ్మవారు, అయ్యవారికి మాత్రమే దక్కింది.
ప్రతి జన్మలోనూ తన పతినే మరల, మరల పతిగా పొందుతున్న ఆ పరమ పతివ్రత,
సాధ్వీ నామము సార్ధకముగా వున్న, ఆ సాధ్వి కి వందనం.
ఓం శ్రీ సాధ్వ్యై నమః
129. శరచ్చంద్రనిభాననా
శరదృతువులో చంద్రుడు చల్లని వెన్నెలలు వెదచల్లుతూ ఉంటాడు.
శరత్ పూర్ణిమ నాడు ఈ కాంతి, ఆ జ్యోత్స్న మరింత ప్రకాశంగా, మరింత చల్లగా, మరింత హాయిగా
ఉంటుంది. ఆ ఋతువులో ఉన్నంత నిండైన చందమామ మరి ఏ సందర్భంలోనూ ఉండదు.
ఆ ప్రసన్నత, ఆ శాంతము, ఆ ప్రకాశము, ఆ ద్యుతి అనుపమానం. అమ్మవారు అటువంటి
శరచ్చంద్రుని వంటి ముఖమును పోలి ఉంటుంది. శరత్ చంద్రుని వంటి కాంతి, ప్రసన్నత,
సుఖము, అన్నింటికీ అమ్మ ముఖము నెలవు. శరదృతువులో చంద్రుని ఒక్కసారి
పూర్ణిమ నాడు చూడండి. ఆ చంద్రునిలో అమ్మను, శరత్ చంద్రునితో సమానమైన
ముఖము కల ఆ శరచ్చంద్రనిభాననను దర్శించండి.
ఆ వెన్నెల జల్లులలో మనలను ఎంతో చల్లగా చూస్తూ సుఖము, శాంతమును ఇస్తున్న,
ఆ శరచ్చంద్రనిభానన కు వందనం.
ఓం శ్రీ శరచ్చంద్రనిభాననాయై నమః
130. శాతోదరీ
శాతము అంటే కృశించిన అనే అర్ధము వున్నది.
అమ్మవారు సన్నని కృశించిన ఉదరము కలది అని భావము.
అమ్మవారి మధ్యభాగము సన్నగా వున్నది అని ముందు నామములలో కూడా చెప్పుకున్నాం.
కృశించిన ఉదరము కల ఆ తల్లి శాతోదరి అని ఈ నామము అర్ధము.
హైమావతి, హిమవంతుని కుమార్తె. హిమవంతుడికి శతోదరుడు అని పేరున్నది.
గుహ అంటే పర్వత కుక్షి అని ఒక అర్ధము. హిమాలయ పర్వతములలో వందలాది
గుహలున్నాయి. శతము అంటే ఒక్క వంద మాత్రమే కాదు. వందల కొద్దీ అని కూడా అర్ధం.
హిమవంతుడు, తన ఉదరంలో వందల కొద్దీ గుహలు కలిగివున్నవాడు కనుక అతడు శతోదరుడు.
శతోదరుని పుత్రిక కనుక, పార్వతి శాతోదరి. శాతము, సుఖము, శాంతము కలిగించే తల్లి.
శాతోదరి అనే నామము ధరించి భక్తులకు శాతము, శాంతము ఇస్తున్న, ఆ శాతోదరి కి వందనం.
ఓం శ్రీ శాతోదర్యై నమః
131. శాంతిమతీ
అమ్మవారు శాంతి మూర్తి. శాంతి కలది. తన శాంతమును అందరికీ ప్రసాదము వలె
పంచే శ్రీమాత ఆ శాంతిమతి. శాంతము ఇంద్రియ నిగ్రహం వలన మాత్రమే వస్తుంది.
ఇంద్రియాలకు లొంగక, ఏ కర్మ చేస్తున్నా చలించకుండా స్థిర బుద్ధితో ఉండటాన్ని
శాంతము అంటాము. స్థిత ప్రజ్ఞులకు శాంతము ప్రధాన లక్షణము.
ఆ లలితాపరమేశ్వరిని ఈ నామములో శాంతిమతీ అని కీర్తిస్తున్నాము.
ఆ లలితారూపములో అమ్మవారు తన భక్తులను శాంతముగా చూస్తోంది.
అమ్మ ఎటువంటి గర్వము, అహంకారము, తీక్ష్ణత లేక తన భక్తులను చల్లగా చూస్తున్నది.
తనను నమ్మినవారందరికీ శాంతము నిస్తున్న, ఆ శాంతిమతి కి వందనం.
ఓం శ్రీ శాంతిమత్యై నమః
132. నిరాధారా
ఓం శ్రీ నిరాధారాయై నమః
133. నిరంజనా
ఈ నామములో అమ్మను జ్ఞానమూర్తిగా కీర్తిస్తున్నాము. అంజనము అంటే కాటుక,
నల్లని పదార్ధము, మాయా వస్తువు. నల్లనిది అజ్ఞానము.
అంజనము లేనిది అనగా అజ్ఞానము లేని పరమ జ్ఞానస్వరూపము ఆ లలితాదేవి.
ఏ మాయాసంబంధమూ లేనిది. నిరంజనా అంటే ఎటువంటి దోషములూ లేనిది.
అవిద్య లేనిది, అజ్ఞానము లేనిది, దోషము లేనిది, మాయ లేనిది.
తానే ఈ సమస్త సృష్టినీ సృజించినప్పటికీ ఏ మాయా అంటనిది.
ఏ దోషమూ, అజ్ఞానమూ, ఏ మాయా లేని ఆ నిరంజన కు వందనం.
ఓం శ్రీ నిరంజనాయై నమః
------------భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి