పంచప్రేతాసనాసీనా, పంచబ్రహ్మ స్వరూపిణీ
చిన్మయీ, పరమానందా, విజ్ఞాన ఘనరూపిణీ ॥ 61 ॥
249. పంచప్రేతాసనాసీనా
అయిదు ప్రేతముల చేత ఏర్పడిన ఆసనంపై అధిష్టించిన మాత అని అర్ధం.
ప్రేతము అంటే శవము, జీవము లేనిది. దీనికి శక్తి తోడైతే, ఆ శవమే శివమవుతుంది.
బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, ఈశ్వరుడు, సదాశివుడు వీరికి పంచప్రేతములని పేరు.
అమ్మవారి సింహాసనానికి వీరే నాలుగుకాళ్ళు, ఫలకము.
ఇంతటి గొప్ప సింహాసనం మీద అధిష్టించి వున్నది కనుకే, ఆ మహారాజ్ఞిని
శ్రీమత్సింహాసనేశ్వరీ అన్నాం.
ఈ అయిదు ప్రేతములూ కూర్చిన ఆసనం కనుక ఆ ఆసనానికి పంచప్రేతాసనమని పేరు.
పంచప్రేతముల అధీశ్వరి అయిన, ఆ పంచప్రేతాసనాసీన కు వందనం.
ఓం శ్రీ పంచప్రేతాసనాసీనాయై నమః
ఓం శ్రీ పంచబ్రహ్మస్పరూపిణ్యై నమః
251. చిన్మయీ
చిన్మయీ అంటే చైతన్య స్వరూపిణి. చిన్మయీ అంటే చిదానందం.
చిన్మయీ అంటే ఆదిపరాశక్తి. అమ్మను ఈ నామంలో చిన్మయీ అంటున్నాం.
ఆ పరమేశ్వరి సదా చైతన్య స్వరూపం. శుద్ధ, సత్వ, చైతన్య స్వరూపం. అందుకే అమ్మ చిన్మయి.
అమ్మ ఎప్పుడూ చిదానందంలో ఉంటుంది. ఆమె చిద్రూప, అందుకే ఆ తల్లి చిన్మయి.
ఆ రాజరాజేశ్వరి సదా బ్రహ్మానందంలో ఉంటుంది. ఆ తల్లి ఆనందదాయిని.
ఆ తల్లి చిరునవ్వులో ఎప్పుడూ దివ్యత్వం ఉంటుంది.
ఎప్పుడూ ఆహ్లాదంగా ఉంటూ భక్తులకు చిదానందాన్ని కలిగిస్తుంది.
అన్నింటా చైతన్య స్వరూపముతో వ్యక్తమవుతున్న, ఆ చిన్మయి కి వందనం.
ఓం శ్రీ చిన్మయ్యై నమః
252. పరమానందా
ఆనందమే పరబ్రహ్మ అని విష్ణుసహస్రనామస్తోత్రంలో చెప్పారు.
రకరకాల ఆనందం గురించి చెప్పుకుంటూ ఉంటాం. భౌతికానందము, మానసికానందము,
ఆధ్యాత్మికానందము, సదానందము, చిదానందము, పరమానందము, బ్రహ్మానందము అని.
ఈ నామంలో అమ్మను పరమానందా అంటున్నాం. అంటే, పరముతో కూడిన ఆనందం.
ఈ ఆనందమే అన్ని ఆనందాల్లోకీ పరమోత్కృష్టమైనది.
ఇది శాశ్వతానందం. ఇది పొందిన జీవుడు ధన్యుడు.
జీవుడిని పరముతో అనుసంధానము చేసే ఆనందమే పరమానందం.
ఉపాసకులను పరమానందంతో అనుగ్రహిస్తున్న, ఆ పరమానంద కు వందనం.
ఓం శ్రీ పరమానందాయై నమః
253. విజ్ఞాన ఘనరూపిణీ
విజ్ఞానము చిక్కనిదై, సాంద్రమైనప్పుడు, ఆ విజ్ఞానాన్ని ఘనమైన, గొప్పదైన విజ్ఞానము అంటాం.
విజ్ఞానమంటే చైతన్యము, సంజ్ఞానము అని అర్ధం. శాస్త్ర జ్ఞానమే విజ్ఞానము.
అన్ని శాస్త్రములకు ఆదిమూలము ఆదిపరాశక్తి, ఆ జ్ఞానేశ్వరి.
తాను స్వయముగా చైతన్యమయి, ఆ చైతన్యాన్నే అందరికీ ప్రసారం చేస్తున్న శక్తి రూపం అమ్మ.
అమ్మను మించిన విజ్ఞానము లేదు, ఆ విజ్ఞానము కూడా సంపూర్ణమైనది, చైతన్యవంతమైనది.
ఆ విజ్ఞానములో కొంచెము కూడా లోపమూ లేదు. లోటూ లేదు. సందు చొరలేనంత పరిపూర్ణ
విజ్ఞానమది. కనుకనే ఆ తల్లిని విజ్ఞాన ఘన రూపిణీ అని ఈ నామంలో చెప్తున్నాం.
విజ్ఞానమే పోత పోసిన స్వరూపము అయిన, ఆ విజ్ఞాన ఘనరూపిణి కి వందనం.
ఓం శ్రీ విజ్ఞానఘనరూపిణ్యై నమః
------------భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి