మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణీ
మహాకామేశ మహిషీ, మహాత్రిపుర సుందరీ ॥ 57 ॥
232. మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణీ
మహాకల్పాంతమందు మహేశ్వరుడు చేసే మహాతాండవానికి లలితాదేవి సాక్షి,
అందుకే ఈ నామం వచ్చింది. మహాకల్పం చివరిలో ఆ మహా రుద్రుడు మహాతాండవం
చేస్తూ ఉంటాడు. ఆ మహాతాండవంలో అన్నీ, అందరూ ఆ అమ్మలో లయమైపోతారు.
ఆ మహాతాండవంలో జీవులనన్నింటినీ సంహరించి ఉద్ధరించిన మహేశ్వరుడిని
చూచి ఆ మహాకాళి సంతోషిస్తుంది. మొత్తం సృష్టి నంతా తనలో లయింపచేసుకుని
తానొక్కతే ఆ తాండవనాట్యానికి సాక్షిగా ఉంటుంది.
ఆ మహా కల్పాంత సమయంలో మహా తాండవం చేస్తున్న మహేశ్వరుడుని చూచి ఆనందిస్తున్న,
ఆ మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి కి వందనం.
ఓం శ్రీ మహేశ్వరమహాకల్పమహా తాండవసాక్షిణ్యై నమః
ఓం శ్రీ మహాకామేశమహిష్యై నమః
234. మహాత్రిపుర సుందరీ
అమ్మవారు మహా లావణ్య శేవధి. త్రిపురములలో మహా సుందరి.
మాతృ మాన మేయము లను త్రిపురాలంటాము. ఈ మూడూ ఆ లలితా పరమేశ్వరియే.
మాతృ అంటే కొలిచేవాడు, మాన అంటే కొలత, మేయము అంటే కొలవబడునది.
ఈ మూడూ కూడా ఆ శ్రీలలితయే. ఈ మూడింటిలో కూడా ఆ తల్లే గొప్పది.
ఆ గొప్పదనాన్ని ఇక్కడ సౌందర్యముతో పోల్చారు. సౌందర్యారాధన కూడా ఆరాధనమే.
శ్రీకృష్ణుణ్ణి, శ్రీరాముణ్ణి, శ్రీలక్ష్మిని, శ్రీలలితని ఆ సౌందర్యాన్ని చూసే కదా అందరూ
ఆరాధిస్తున్నారు. త్రివురములలోనూ అత్యుత్తమమైన సౌందర్యము కలిగి వున్నది కనుక,
ఆ లలితాపరమేశ్వరికి ఈ నామం వచ్చింది. అట్టి మహాత్రిపుర సుందరి కి వందనం.
ఓం శ్రీ మహాత్రిపురసుందర్యై నమః
------------భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి