
శ్రుతి సీమంత సిందూరీకృత పాదాబ్జధూళికా
సకలాగమ సందోహ శుక్తిసంపుట మౌక్తికా ॥ 68 ॥
289. శ్రుతి సీమంత సిందూరీ కృత పాదాబ్జ ధూళికా
ఓం శ్రీ శ్రుతి సీమంత సిందూరీ కృత పాదాబ్జ ధూళికాయై నమః
290. సకలాగమ సందోహ శుక్తి సంపుట మౌక్తికా
శుక్తి సంపుటము అంటే, ముత్యపు చిప్ప. వాటి సందోహము అంటే, అటువంటి ముత్యపుచిప్పల
గుంపు. ముత్యపు చిప్పలో అద్భుతమైన, అపూర్వమైన, అమూల్యమైన ముత్యాలు ఉంటాయి.
ఈ నామంలో, సకల ఆగమాల సముదాయమునూ ముత్యపు చిప్పలతో పోలుస్తున్నారు.
ఆ సంపుటిలో నున్న అమూల్యమైన ముత్యములే, అమ్మవారు ముక్కున పెట్టుకునే ముక్కెరకు
వేళ్ళాడే ముత్యాలు. అన్ని వేదముల, ఆగమముల సారము అమ్మ ముక్కుపోగుకు సరి అని
ఈ నామం చెపుతోంది. అరుంధతి చాలా సూక్ష్మ నక్షత్రం. దానిని చూడటం కష్టం.
అందుకని దానికన్నా ఎంతో పెద్దదైన సప్తఋషి మండలాన్నీ, దానిలో వున్న వశిష్ట నక్షత్రాన్నీ
చూపిస్తూ, అదిగో, ఆ పక్కనే కనిపించే బుల్లి నక్షత్రమే అరుంధతి అని చెప్తూ వుంటారు.
అదే విధంగా ఎంతో గొప్పదైన అమ్మ మహత్తును చూపటానికి ముత్యపు చిప్పల్లోని మంచి
ముత్యమును చూపుతూ, అంత మేలిమి ముత్యము కూడా అమ్మ ముక్కెరకు వేళ్ళాడుతున్న
ముత్యము అని చెపుతున్నారు.
ఇంక అమ్మ నిజరూప మహాత్మ్యాలను ఏమని వర్ణించగలము.
వేదాల్లోని సారమే అమ్మ ముక్కెరకు వేలాడే ముత్యమంతగా ప్రకాశిస్తున్న,
ఆ సకలాగమ సందోహ శుక్తి సంపుట మౌక్తిక కు వందనం.
ఓం శ్రీ సకలాగమ సందోహ శుక్తి సంపుట మౌక్తికాయై నమః
------------భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి