నిత్యముక్తా, నిర్వికారా, నిష్ప్రపంచా, నిరాశ్రయా
నిత్యశుద్ధా , నిత్యబుద్ధా, నిరవద్యా, నిరంతరా ॥ 45 ॥
144. నిత్యముక్తా
ఆ జగదాంబ నిత్యముక్త, అంటే, మోక్ష స్వరూపిణి. ముక్తిని ఇచ్చే తల్లి, ఆ లలితాపరమేశ్వరి.
ఏ గుణములకూ, ఏ లక్షణములకూ, ఏ బంధనములకూ చిక్కనిది నిత్య ముక్త స్థితి.
సృష్టి, స్థితి, లయములను చేస్తూనే, ఆ కార్యములేవీ తనకు అంటని స్థితి ముక్తస్థితి.
అటువంటి స్థితిలో నిత్యమూ వుండే ఆ తల్లి నిత్యముక్త.
అటువంటి నిత్యముక్త ఆ లలితాదేవి ఒక్కతెయే.
విత్తులో చెట్టునూ, చెట్టులో విత్తునూ ఏకకాలంలో దర్శించగల స్థితి ముక్త స్థితి.
ముక్తులు సాలోక్యము, సామీప్యము, సారూప్యము, సాయుజ్యము అని నాలుగు రకాలు.
త్రిగుణములూ, పంచభూతములూ కలిసి జీవుడు ఎప్పుడూ అష్ట బంధనములలో ఉంటాడు.
నిజానికి త్రిమూర్తులు, సమస్త దేవతలూ కూడా త్రిగుణాలకు లోబడే వుంటారు.
అమ్మ త్రిగుణాలకు అతీతంగా ఉంటుంది. గుణములను విడిచినది కనుక ఆమె నిత్యముక్త.
తన భక్తులకు నిత్యమూ ముక్తిని కలగచేస్తూ ఉంటుంది కనుక, ఆమె నిత్యముక్త.
తాను నిత్యముక్తయై, తన భక్తులను ముక్తస్థితిని ఇస్తున్న, ఆ నిత్యముక్త కు వందనం.
ఓం శ్రీ నిత్యముక్తాయై నమః
ఓం శ్రీ నిర్వికారాయై నమః
ప్రపంచపు ఆవరణలకు లొంగనిది నిష్ప్రపంచ. పంచ భూతములతో ఏర్పడినది ప్రపంచము.
తానే సృష్టించిన ఈ పంచభూతాత్మకమైన ప్రపంచమునకు అమ్మ అతీతము.
అమ్మకు ఈ స్థూల, సూక్ష్మ, కారణ ప్రపంచములు ఏమాత్రమూ అంటవు.
పంచ జ్ఞానేంద్రియాలూ, పంచ కర్మేంద్రియాలూ, పంచభూతములూ, పంచతన్మాత్రలూ,
పంచప్రాణాలూ, పంచ బ్రహ్మలూ మొదలైనవన్నీ అమ్మ చేత సృష్టింపబడినవే.
అమ్మ తనచే సృష్టింపబడిన సృష్టిని పోషిస్తుంది కానీ, దానికి లోబడి ఉండదు.
కనుక ఆ లలితాదేవికి ప్రపంచము లేదు. ఆ అమ్మ ప్రపంచ రహిత.
కానీ జీవుడికి సర్వమూ ఈ ప్రపంచమే. లేచినది మొదలు, ఈ ప్రపంచ మాయలో పడి, మనసు
యాతన పడుతూనే ఉంటుంది. ఈ యాతన నుంచి విముక్తి కావాలంటే, ధ్యానము కానీ, నిద్ర కానీ
శరణ్యము. నిద్రలో మనసు సేద దీరుతుంది. కనుక ప్రపంచపు మాయలు బాధించవు.
ధ్యానములో అన్నీ తెలిసినా, నిగ్రహ స్థితి ఉంటుంది కనుక అప్పుడూ మనసుకి విశ్రాంతే.
అమ్మని శరణు వేడితే, ప్రపంచము శాంతముగా స్పందిస్తుంది. వేదన ఉండదు.
తాను సృష్టించిన ప్రపంచములకు అతీతముగా వున్న ఆ ప్రపంచరహిత,
ఆ నిష్ప్రపంచ కు వందనం.
ఓం శ్రీ నిష్ప్రపంచాయై నమః
147. నిరాశ్రయా
జగన్మాత ఆశ్రయంలోనే సమస్తమూ వుంది. అమ్మ అందరికీ ఆశ్రయం కల్పిస్తుంది కానీ,
తాను ఏ ఆశ్రయం లోనూ ఉండదు. నిరాకార కనుక, ఆ తల్లి శరీరము లేనిది.
మనం అందరం శరీరాన్ని ఆశ్రయించి ఉంటాం. ఇంకా మన ఆస్తిపాస్తుల, పదవీ అధికారాల,
బంధు మిత్రుల, ఆశ్రయంపై ఆధారపడి ఉంటాం. కానీ ఇవి ఏవీ శాశ్వతం కాదు.
కేవలం అమ్మ ఇచ్చిన ఆశ్రయంపైనే ఈ జగత్తంతా ఆధారపడి వున్నది.
బ్రహ్మ, మహేంద్ర, ఉపేంద్రులు కూడా ఈ తల్లి ఆశ్రయంలో వున్నవారే.
ఆ తల్లి తాను ఆశ్రయం కల్పించిన ఏ ఒక్కరి నుంచీ ఆశ్రయము తీసుకోదు.
కనుక ఆ లలితాదేవి నిరాశ్రయ. తానూ అందరికీ ఆశ్రయం ఇస్తూ,
తాను ఏ ఆశ్రయమూ లేకుండా వుండే ఆ నిరాశ్రయ కు వందనం.
ఓం శ్రీ నిరాశ్రయాయై నమః
148. నిత్యశుద్ధా
ఆ జగదాంబ నిత్యశుద్ధ. ఆ రాజరాజేశ్వరిని ఎవ్వరూ తాకలేరు, కనుక ఆ తల్లి నిత్యశుద్ధ.
అమ్మకి ఏ మలినాలూ, మలములూ అంటవు, కనుక ఆ తల్లి నిత్యశుద్ధ.
అమ్మకి అజ్ఞానము, అవిద్య వంటి మలములు లేవు, కనుక నిత్యశుద్ధ.
అమ్మ స్వయముగా శుద్ధ చైతన్యమూర్తి, కనుక నిత్యశుద్ధ.
అమ్మ శుద్ధవిద్యా స్వరూపిణి, కనుక నిత్యశుద్ధ.
ఆ పరమేశ్వరికి ఏ మాయా మోహములూ లేవు , కనుక ఆ తల్లి నిత్యశుద్ధ.
ఉపాసకులు మాత్రమూ పై చెప్పబడిన ఏ మాలిన్యములు తమకు అంటకుండా చూచుకోవాలి.
కనుక చాలా శ్రద్ధాభక్తులతో తమను తాము నిరంతరమూ శుద్ధులను చేసుకుంటూ ఉండాలి.
తాము పొందిన జ్ఞానముపై అహంకారపు మలినపు పొరలు ఏర్పడకుండా చూసుకోవాలి.
ఏ మాయా, మోహమూ, అవిద్యా, అజ్ఞానము వంటి మలినములు లేని ఆ నిత్యశుద్ధ కు వందనం.
ఓం శ్రీ నిత్యశుద్ధాయై నమః
149. నిత్యబుద్ధా
ఆ లలితాపరమేశ్వరిని ధ్యానించి, బుద్ధిం యోనః ప్రచోదయాత్ అనుకోండి.
బుద్ధిని ప్రచోదనం చేసేది ఆ శుద్ధవిద్యాస్వరూపిణి అయిన నిత్యబుద్ధాదేవియే.
నిత్యమూ మంచి బుద్ధితో అలరారే తల్లి ఆ లలిత. తెలివికి మారురూపం లలిత.
తన భక్తులందరికీ బుద్ధి ప్రదాత ఆ లలితా పరమేశ్వరి.
ఆ చిద్రూప, జ్ఞానస్వరూప. ఆ జ్ఞానములో లోపము ఉండదు. అందుకే ఆమె నిత్యబుద్ధ.
జైన తీర్ధంకరులైన శుద్ధ, బుద్ధులనే వారు తారాదేవి ఉపాసకులు.
అందుకే ఆ దేవి నిత్యశుద్ధా, నిత్యబుద్ధా అనే నామాలు స్వీకరించింది.
శుద్ధ సత్వ బుద్ధి స్వరూపిణి అయిన, ఆ నిత్యబుద్ధ కు వందనం.
ఓం శ్రీ నిత్యబుద్ధాయై నమః
150. నిరవద్యా
శ్రీదేవి ఏ లోపమూ లేని, నిందా లేని, వికారమూ లేని జ్ఞానము కలది.
ఆ శుద్ధవిద్యా జ్ఞానము నిత్యము, సత్యము, లోపరహితము.
శుద్ధవిద్యతో తన భక్తులకు అవద్యా నరకము తప్పించునది ఆ నిరవద్య.
అవద్య అంటే కుత్సితము. నిరవద్యా అంటే కుత్సితము లేనిది, లోపము లేనిది.
అవిద్యకు, అజ్ఞానమునకు, లోపమునకు, నిందకూ అతీతమైనది కనుక ఆ తల్లి నిరవిద్య.
నిరంతరమూ భక్తులకు లోపము లేని జ్ఞానాన్ని ప్రసాదిస్తూ,
అవద్యానరక బాధల నుంచి తప్పిస్తున్న, ఆ నిరవద్య కు వందనం.
ఓం శ్రీ నిరవద్యాయై నమః
151. నిరంతరా
ఓం శ్రీ నిరంతరాయై నమః
------------భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి