విశుద్ధి చక్రనిలయా, ఆరక్తవర్ణా, త్రిలోచనా
ఖట్వాంగాది ప్రహరణా, వదనైక సమన్వితా ॥ 98 ॥
475. విశుద్ధిచక్రనిలయా
ఓం శ్రీ విశుద్ధిచక్రనిలయాయై నమః
476. ఆరక్తవర్ణా
ఆరక్తవర్ణా అంటే కొద్దిగా తెలుపు కలసిన ఎరుపు రంగు అని అర్ధం. అటువంటి వర్ణాన్ని
పాటలీ వర్ణము అంటారు. తెలుపు, ఎరుపు కలసిన పాటలీ వర్ణము, అంటే గులాబీ రంగు.
ఈ నామంలో విశుద్ధి చక్ర నిలయ యొక్క వర్ణము పాటలీ వర్ణమని చెప్తున్నారు.
పాటలీవర్ణములో ఆ లలితాదేవి పద్మములో ప్రశాంతంగా కూర్చుని మెరిసిపోతున్నది.
ఈ నామంలో అమ్మవారి దేహచ్ఛాయ గురించి తెలుసుకున్నాం.
పాటలీవర్ణంలో అందముగా వెలిగిపోతున్న దేహచ్ఛాయలో వున్న, ఆ ఆరక్తవర్ణ కు వందనం.
ఓం శ్రీ ఆరక్తవర్ణాయై నమః
477. త్రిలోచనా
ఈ నామంలో ఆ విశుద్ధిచక్రనిలయకు మూడుకన్నులున్నవని చెప్పుకుంటున్నాం.
అమ్మ త్రయీమయి కదా. ముచ్చటైన మూడుకన్నులతో ఈ సృష్టిని అంతా చూస్తూ,
అన్ని కార్యాలూ పర్యవేక్షిస్తోంది. ఆ మూడు కన్నులే సూర్యుడు, చంద్రుడు, అగ్ని.
ఏమి చూడాలన్నా కాంతి కావాలి కదా. అమ్మ మూడు కన్నులూ మూడు కాంతి స్రోతస్సులు.
కన్నులకు ఆ కాంతి ప్రవాహాన్ని ఇచ్చింది శ్రీలలితాపరమేశ్వరియే.
అసలైన కాంతి జనకమైన ఆ కాంతిమతి, తన కిరణాలను సూర్య, చంద్ర, అగ్నుల ద్వారా
ప్రసరిస్తోంది. ఆ మూడు కన్నులూ ఋగ్యజుర్సామ వేదాలకు ప్రతీక.
ప్రతి జీవికీ కూడా మూడు కన్నులు ఉంటాయి, ఆ కన్నులను వాడటం తెలుసుకోవాలి, అంతే .
మూడు కన్నులతో ఈ సృష్టి కంతటికీ కాంతిని ప్రసారం చేస్తున్న, ఆ త్రిలోచన కు వందనం.
ఓం శ్రీ త్రిలోచనాయై నమః
ఓం శ్రీ ఖట్వాంగాదిప్రహరణాయై నమః
479. వదనైకసమన్వితా
వదనైక సమన్వితా అంటే, ఏక వదనంతో వున్నది అని అర్ధం.
విశుద్ధిచక్రనిలయ కు ఒకే ముఖము. ఆ అందమైన ముఖంతో, అమితమైన తేజస్సుతో
వున్న లలితాదేవిని గురించి ఈ నామంలో చెప్పుకుంటున్నాం.
ప్రతివారి ముఖంలోనూ తేజో రూపములో వున్నది ఆ వదనైకసమన్విత యైన శ్రీ లలిత.
అందంగా అమరివున్న ఒక్క ముఖమును కలిగివున్న, ఆ వదనైకసమన్విత కు వందనం.
ఓం శ్రీ వదనైకసమన్వితాయై నమః
------------భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి