రాజత్కృపా, రాజపీఠ నివేశిత నిజాశ్రితాః ॥ 134 ॥
684. రాజరాజేశ్వరీ
రాజులను, రాజరాజులను, దేవతలను పాలించు, ఆ రాజరాజేశ్వరి కి వందనం.
ఓం శ్రీ రాజరాజేశ్వర్యై నమః
685. రాజ్యదాయినీ
రాజ్యములను ఇచ్చునది రాజ్యదాయినీ. ఇంద్రుణ్ణి స్వర్గమునకు రాజుగా చేసినది రాజరాజేశ్వరి.
విష్ణువును వైకుంఠమునకూ, శివుడిని కైలాసమునకూ, బ్రహ్మను సత్యలోకమునకూ
అధిపతులను చేసినది రాజ్యదాయినీ అయిన ఈ పరమేశ్వరి.
అష్టదిక్పాలకులకూ ఆయా ఆధిపత్యములను ఇచ్చింది ఈ జగన్మాతే.
దేవతలను స్వర్గము మొదలైన ఉత్కృష్టమైన ఊర్ధ్వలోకాలకు ఆధిపతులను చేసేది జగదీశ్వరి.
బలిచక్రవర్తికి సుతల లోకాధిపత్యమును ఇచ్చినదీ ఈ జగదాంబే.
ఎప్పుడు దేవతలకు ఏ కష్టం వచ్చి రాజ్యం కోల్పోయినా, వారు తిరిగి ఆ రాజ్యాన్ని పొందేలా
చూసేది ఈ రాజ్యదాయినీ దేవతే. అందుకే ఈ నామంలో అమ్మను రాజ్యదాయినీ అంటున్నాం.
ఎవరైనా పదవి కోల్పోతే, ఈ నామజపం చేస్తే, ఫలితం ఉంటుంది.
అర్హులైనవారికి రాజ్యాధిపత్యములను అనుగ్రహిస్తున్న, ఆ రాజ్యదాయిని కి వందనం.
ఓం శ్రీ రాజ్యదాయిన్యై నమః
686. రాజ్యవల్లభా
రాజ్యములంటే ఇష్టపడేది రాజ్యవల్లభా. స్వర్గాది రాజ్యములంటే అమ్మకు ఇష్టం.
ఆ రాజ్యాధిపతులంటే అనుగ్రహం కల తల్లి రాజ్యవల్లభా.
మణిద్వీపమందు కల శ్రీమన్నాగరానికి నాయిక ఈ తల్లి.
ఆ శ్రీమన్నగరంలో చక్రవర్తులు, దేవతలు, వారి భార్యలతో కూడి అమ్మను సేవిస్తూ వుంటారు.
అమ్మ ఈ రాజరాజులందరికీ రాజ్యాలిచ్చిన రాజ్యదాయినీ.
వీరెవ్వరూ అమ్మ ఆజ్ఞను దాటి చరించరు. పరమేశ్వరి ఆ శ్రీ చక్రనగరమహాసామ్రాజ్ఞి.
అన్ని రాజ్యాలూ, అందరు రాజులూ ఆ శ్రీచక్రనగర సామ్రాజ్ఞికి అధీనులుగానే వుంటారు.
అందుకే ఈ నామంలో అమ్మను రాజ్యవల్లభా అంటున్నాం.
రాజ్యములను, రాజులను వశము చేసుకున్న, ఆ రాజ్యవల్లభ కు వందనం.
ఓం శ్రీ రాజ్యవల్లభాయై నమః
ఓం శ్రీ రాజత్కృపాయై నమః
688. రాజపీఠనివేశితనిజాశ్రితా
తనను ఆశ్రయించిన భక్తులను రాజపీఠములపై కూర్చుండ బెట్టినది అని ఈ నామార్ధం.
తనను ఆశ్రయించి వున్న భక్తుల పట్ల కృప కలిగివుంటుంది ఆ శ్రీలలిత.
అర్హులైన, యోగ్యులైన, తన భక్తులకు రాజ్య సింహాసనములను,
పదవులను ఇచ్చు తల్లి కనుక, అమ్మను రాజపీఠ నివేశిత నిజాశ్రితా అన్నారు.
రాజపీఠముల నెక్కే పదవుల నిచ్చి కరుణించే, ఆ రాజపీఠనివేశితనిజాశ్రిత కు వందనం.
ఓం శ్రీ రాజపీఠనివేశితనిజాశ్రితాయై నమః
------------భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి