సనకాదిసమారాధ్యా, శివజ్ఞానప్రదాయినీ ॥ 140 ॥
723. స్వతంత్రా
దీనిని బట్టీ పార్వతీ పరమేశ్వరులు ఒకరికొకరు పరస్పరాధీనులని తెలుస్తోంది.
ఓం శ్రీ స్వతంత్రాయై నమః
724. సర్వతంత్రేశీ
మన సంప్రదాయంలో అరవైనాలుగు తంత్రాలు వున్నాయి. ఆ తంత్రాలన్నింటినీ సృష్టించిన
ఈశ్వరి కనుక, ఈ నామంలో అమ్మను సర్వతంత్రేశీ అంటున్నాం.
ఆ తంత్రాలన్నింటితో ఆరాధింపబడుతున్నది కనుక సర్వ తంత్రేశీ నామం వచ్చింది.
మంత్రం, తంత్రం, యంత్రం అంటే ఏమిటో ముందు నామాల్లో చెప్పుకున్నాం.
తంత్రములో మంత్రముతో పాటు క్రియ కూడా ఉంటుంది. కౌలాచారం, వామాచారంలో
తంత్రాలు వాడతారు. లౌకిక సుఖములు, కామ్యముల కోసం ఉపాసనలో తంత్రాలు
వాడటం సంప్రదాయంలో వున్నది.
అన్ని తంత్రాలకూ సృష్టికర్త అయిన, ఆ సర్వతంత్రేశి కి వందనం.
ఓం శ్రీ సర్వతంత్రేశ్యై నమః
725. దక్షిణామూర్తిరూపిణీ
దక్షిణామూర్తి స్వరూపురాలు అని ఈ నామానికి అర్ధం.
సనక సనందనాది ఋషులు బ్రహ్మము గూర్చి తెలుసుకోవాలని శివునికై తపస్సు చేశారు.
వారి సంశయములు తీర్చడానికి శివుడు దక్షిణాభిముఖుడై వచ్చాడు.
ఆ దక్షిణామూర్తి దర్శన మాత్రం చేత, శిష్యులందరికీ సంశయములు ఛిన్నమై పోయి,
జ్ఞానం కలిగింది. ఆ విధంగా దక్షిణాభిముఖుడై, శిష్యులకు మౌనంగానే సంశయాలను తీర్చి,
జ్ఞానోపదేశం చేయడం వలన, శివుడికి దక్షిణామూర్తి అనే పేరు వచ్చింది.
దక్షిణామూర్తిగా శివుడు మౌనవ్యాఖ్యల తోనే శిష్యుల సంశయాలను దూరం చేశాడు.
ఆ మౌనమే దక్షిణామూర్తి తత్త్వము. ఆ తత్త్వమే దేవీ తత్త్వము కూడా.
అందుకే అమ్మకు కూడా అదే నామం వచ్చింది. సతీపతుల పేర్లు ఇద్దరివీ దక్షిణామూర్తి
కనుక, నామ సామ్యం కూడా కుదిరింది.
చిత్తూరు జిల్లాలోని సురుటుపల్లిలో కల పళ్లికొండేశ్వరస్వామి ఆలయంలో దక్షిణామూర్తి రూపంలో
వున్న శివుని ఎడమ తొడపై కూర్చుని, దక్షిణామూర్తి రూపంలో వున్న పార్వతి దర్శనం ఇస్తుంది.
మరెక్కడా కనబడని అపురూపమైన విగ్రహం. మంత్రతంత్రాలలో దక్షిణామూర్తి మంత్రం ప్రసిద్ధి.
జ్ఞానదాయిని అయిన దక్షిణామూర్తి పత్ని, దక్షిణామూర్తి నామ రూపిణి అయిన,
ఆ దక్షిణామూర్తిరూపిణి కి వందనం.
ఓం శ్రీ దక్షిణామూర్తిరూపిణ్యై నమః
ఓం శ్రీ సనకాదిసమారాధ్యాయై నమః
727. శివజ్ఞానప్రదాయినీ
శివునకు జ్ఞానమును కలిగించునది, లేదా శివజ్ఞానమును ఇచ్చునది అని ఈ నామానికి అర్ధం.
వాశిష్ఠ రామాయణములో "శివ విషయిక జ్ఞానమును అధికముగా ఇచ్చునది. ఏవిధముగా
కదలిక వలన వాయువు ఉన్నట్టు, వేడి వలన అగ్ని ఉన్నట్టు తెలుస్తోందో, అదే విధంగా
నిర్మల శాంత చైతన్యమూర్తి అయిన శివుడు, జ్ఞానం రూపంలో వున్న శక్తి వలన మాత్రమే
తెలియబడుచున్నాడు. ఇతరముగా శివుడు తెలియబడడు" అని చెప్పబడింది.
అంటే, శివుడనే జ్ఞానాన్ని కలిగించేది శక్తి. అమ్మ చేత అయ్య తెలియబడుచున్నాడు.
లేదా శివుడికి శక్తి జ్ఞానము వుంది. అది ప్రకటితం చేస్తున్నాడు అని మరొక భావన.
వరాహపురాణంలో, "ఎవరు రుద్రుని యదార్ధ స్వరూపాన్ని తెలుసుకుంటారో వారికి త్రిశక్తులైన
పార్వతీ, లక్ష్మీ, సరస్వతీ కూడా అధీనులవుతారు" అని వున్నది.
అంటే, శివుని పొందితే, త్రిశక్తులు కూడా వశమవుతాయి అని అర్ధం.
తన భక్తులకు శివజ్ఞానాన్ని ప్రదానము చేసే, ఆ శివజ్ఞానప్రదాయిని కి వందనం.
ఓం శ్రీ శివజ్ఞానప్రదాయిన్యై నమః
------------భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి