మహతీ, మేరునిలయా, మందార కుసుమప్రియా ॥ 148 ॥
771. దురారాధ్యా
ఓం శ్రీ దురారాధ్యాయై నమః
772. దురాధర్షా
శ్రీదేవి తీవ్రమైన తపము చేత మాత్రమే స్వాధీనమవుతుంది.
ఇంద్రియనిగ్రహం లేనివారిని దూరంగా వుంచు, ఆ దురాధర్ష కు వందనం.
ఓం శ్రీ దురాధర్షాయై నమః
773. పాటలీకుసుమప్రియా
పాటలీ కుసుమాలంటే ఇష్టపడే తల్లి ఆ పాటలీకుసుమప్రియా.
ఈ పాటలీ కుసుమాలుండే ప్రాంతమే పాటలీపుత్రము అని చెప్పుకున్నాం.
పద్మపురాణంలో, "శంకరుడు బిల్వ వృక్షంలో ఉంటే, పార్వతి పాటల వృక్షంలో వుంటుంది" అని
చెప్పారు. అందువలన, శంకరునికి బిల్వ పత్రం ఎంత ప్రీతికరమో, పార్వతికి పాటల పుష్పం
అంత ప్రీతికరము అని స్పష్టమవుతోంది. పాటలీ వర్ణం అంటే లేత గులాబీ రంగు.
విశుద్ధిచక్రపద్మములో కొలువై వున్న డాకినీశ్వరీ మాత తెలుపు, ఎరుపు కలసిన పాటలీ వర్ణములో
ప్రకాశిస్తూ ఉంటుందని ముందే చెప్పుకున్నాం. ఆ పాటలీ కుసుమాలంటే అమ్మకు ఇష్టం.
ఆ పూలతో పూజిస్తే శ్రీమాత సంతోషిస్తుంది.
పాటలీ కుసుమాలను ఇష్టపడే, ఆ పాటలీకుసుమప్రియ కు వందనం.
ఓం శ్రీ పాటలీకుసుమప్రియాయై నమః
ఓం శ్రీ మహత్యై నమః
775. మేరునిలయా
మేరునిలయా అంటే, మేరువును నివాసస్థానముగా చేసుకున్నది అని అర్ధం.
మేరు పర్వతమే నివాసమైనది. మేరు మంత్రస్వరూపురాలు.
మేరు యంత్రమే, మేరుప్రస్తారమే నివాసముగా కలది ఆ రాజరాజేశ్వరి.
జ్ఞానార్ణవంలో తొమ్మిది అక్షరముల నవావరణ మంత్రమున్నది, దానికే మేరుమంత్రమని పేరు.
దేవీ మంత్రములు, మహాత్రిపురసుందరీ మంత్రములన్నియూ ఈ మేరుమంత్రమునుంచే
వచ్చాయని మంత్రశాస్త్రం చెప్తోంది. మంత్రములన్నీ మేరుమంత్రోద్ధారములే.
ఆ మేరు మంత్రస్వరూపురాలు మేరునిలయా.
తంత్రరాజంలో, ఇరవైఎనిమిదవ పటలములో, సాగరములు, ద్వీపములతో కూడిన భూమిని
వర్ణిస్తూ, "మేరువు మధ్యలో శ్రీలలితాదేవి మహాకాంతితో వెలిగిపోతూ ఆసీనురాలయి ఉన్నది.
ఆమె చుట్టూ సముద్రము నందు నిత్యాదేవతలు ఉన్నాయి, చిత్రానిత్య దానికి బయట వున్న
పరమాకాశమందు వున్నది", అని చెప్పబడింది. ఈ విషయాలన్నీ గురుముఖతః తెలుసుకోవాలని
కూడా చెప్పబడింది. శ్రీచక్రమునకు భూప్రస్తారము, కైలాసప్రస్తారము, మేరుప్రస్తారము అని
మూడు రకాల ప్రస్తారాలు వున్నాయి. శ్రీచక్రాన్ని వశిని మొదలగు వాగ్దేవతాష్టకముతో
అనుసంధానం చేస్తే, దాన్ని భూప్రస్తారమంటారు. మాతృకావర్ణములతో అనుసంధానం
చేస్తే, దాన్ని కైలాసప్రస్తారము అంటారు. షోడశనిత్యలతో అనుసంధానం చేస్తే,
దాన్ని మేరుప్రస్తారమంటారు. ఈ రకమైన భావనలన్నీ కొద్ది భేదాలతో, సనత్కుమార సంహిత,
సనంద సంహిత, వశిష్ట సంహిత లందు చెప్పబడ్డాయి.
మేరువులో నివసించునది మేరునిలయా.
మేరువే నివాసముగా కల, ఆ మేరునిలయ కు వందనం.
ఓం శ్రీ మేరునిలయాయై నమః
776. మందారకుసుమప్రియా
మందార పుష్పాలంటే ప్రీతి కలది మందార కుసుమ ప్రియా.
మందార పుష్పాలు ఎర్రగా ఉంటాయి. అమ్మకు ఎరుపు రంగు అంటే ప్రీతి, ఆమె రక్తవర్ణా కదా.
మందారాలనే కొందరు జపాకుసుమాలని కూడా అంటారు. మందార వృక్షం దేవతా వృక్షం.
దీన్నే కల్పవృక్షంగా కూడా భావిస్తారు. ఆ మందార పువ్వులంటే ఇష్టపడునది పరమేశ్వరి.
సంస్కృతంలో శ్వేతార్కవృక్షాన్ని కూడా మందార వృక్షం అంటారు. శ్వేతార్కమంటే తెల్లజిల్లేడు.
తెల్లజిల్లేడు పువ్వులనీ, మందార పువ్వులనీ ఇష్టపడునది అని ఈ నామానికి అర్ధం.
అయిదు దళాలున్న మందారాలు అమ్మకు ప్రీతి, మూడు దళాలున్న మారేడు అయ్యకు ప్రీతి.
మందార పుష్పాలతో పూజిస్తే ప్రీతి చెందే, ఆ మందారకుసుమప్రియ కు వందనం.
ఓం శ్రీ మందారకుసుమప్రియాయై నమః
------------భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి