శ్రీమతి అజిత గారి అనుభవం
(అజిత గారు వాట్సాప్ ద్వారా పంపిన సందేశం)
మేడమ్ గారు నమస్కారం
చాల చక్కగా వివరించారు. మీతో పరిచయం అద్బుతమైన ప్రసాదం.
అమ్మ సహస్ర నామాలు అర్థ వివరణ చదువుతున్న సమయంలో అమ్మవారు నా ప్రక్కన కూర్చోవడం, నాట్యం చేయడం, ఆనందంగా కనిపించడం లాంటి అనుభవాలు జరిగాయి.
మీరు వ్రాసిన ప్రతి నామంలో ఓ ప్రత్యేకత ఉంది.
అమ్మవారి అనుగ్రహం మీపై సదా ఉండాలని, ఇలాంటివి మరిన్నో రాయాలని, మా లాంటి చిన్న వారికి మీరు గురువులుగా ఉండి, ఇంకా ఇంకా ఎన్నో ఎన్నెన్నో సౌందర్యలహరి, దేవిభాగవతం లాంటి గ్రంథాల సారాంశం మాకు తెలపాలని, తెలియని వారికి మార్గం కావాలని, ఆ అమ్మవారి దీవెనలు మీపై నిరంతరం సూర్య కిరణాలుగా వెలుగులు వెలగాలని, మనస్పూర్తిగా మనసార మీకు సదా నా పాదనమస్కారములతో పాదాభివందనాలు మేడమ్ గారు.మీ ద్వారా నాకు చాల చాల అమ్మతో అనుబంధం పెరిగింది.
జై గురు చండి హ్రీయానందబాబా గారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
మేడమ్ గారు మీరు పంపిన ప్రతి నామం చాల విశేషం.
అర్థ వివరణ లో నాకు కలిగిన ఒకటి రెండు అనుభవాలు చెప్పాలనుకున్నాను.
మేడమ్ మొదటగా నేను కొన్ని రోజుల వరకు ఊరికే చదువుతూ వెళ్లాను.
ఆ తరువాత నేను పెద్దగా పట్టించుకోలేదు.
ఓ రోజు ఊరికే చూస్తూ ఉంటే, నా వెన్ను తట్టి కొట్టినంతగా అనిపించి, ఏంటి ఇలా జరిగింది అని చూసా ఎవరు లేరు.
మరల చూసా లేరు.
ఇక
ఆ విషయాన్ని వదిలేసి 176 నామం చదువుతుంటే నాలో కలిగిన ఆనందం అంతా ఇంతా కాదు. ఆ నామంలో మా గురువుగారు హ్రీయానందబాబా గారు కనిపించడం, అమ్మ చండిమాత కనిపించడం జరిగింది.
వెంటనే తేరుకొని మరల మరల చూసా. అదే రూపం కనిపించింది. చాల విశేష స్పందన లభించింది.
ప్రతి నామంలో ఓ అందమైన అనుభవం. అది అనుభవించే వారికే తెలుస్తుంది కదా.
మరి యొక్క సారి నాట్య మయూరం లా......
ఆ సమయంలో నా శరీరం పూర్తిగా తెలియని అనుభూతిని ఆస్వాదించిందండి.
చాల అనుభవాలు జరిగాయి.
మీరు పడిన శ్రమ మీకు తెలియకుండానే ఫలితం ఆ భగవంతుడు వరంలా ప్రసాదించాడు.
మేడమ్ గారు మీరు పరిచయం కావడం నా జన్మ ధన్యం.
మీతో జరిగిన అథ్యాత్మిక సత్సంగం పూర్వ జన్మ ఫలం.
నేను మా గురువు గారితో సంభాషణ చేసాను అనే ఆనందం పూర్తిగా కలిగింది.
ఇక్కడ విజయలక్ష్మి మేడమ్ గారు కాదు,
హ్రీయానందాబాబాతో జరిగిన అద్భుతమైన మాటలు అనే అనాలి.
మాటలు రావడం లేదు.
చెప్పాలని ఉన్నా,
రాయాలని ఉన్నా,
ఈ జీవితం సరిపోదు.
భలేగా ఉందండి మీ సహస్ర నామ వివరణ.
మీతో మాట్లాడటం, మీతో ఈ బంధం ఏర్పడటం, నిజంగా నా జన్మ ధన్యం మేడమ్
తప్పుగా ఉంటే మన్నించగలరు.
పెద్దవారు మీ ముందు నేను ఏదీ చెప్పలేను.
భగవత్ సంకల్పంతో మీరు ఇంకా ఇంకా ఎన్నో ఎన్నెన్నో రాసి మా లాంటి మామూలు ఏలాంటి అర్హత లేని వారిని మీ మార్గ ప్రయాణంలో నడిపించాలని కోరుతూ,
నా మనస్పూర్తిగా కృతజ్ఞతాభి పాద వందనములు మేడమ్ గారు ఏమైన అక్షర దోషం ఉన్న సరిదిద్దుతూ గురువు గారిగా ఈ శిష్యురాలిని క్షమించ గలరు.
మీ ప్రేమకు నేను ఓ భక్తురాలిని
ఇదే ఇదే నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు.
Well said attaya even I also feel like it happens infront of me 🙏👍
రిప్లయితొలగించండిThanks Ajita, for your original, natural expressions.
రిప్లయితొలగించండి