శ్రీ గరికపాటి ప్రభాకర రామానుజ స్వామి గారి అభిప్రాయం
శ్రీరామ జయం! నమస్కారం అండీ!
శ్రీమతి విజయలక్ష్మీ రమేష్ కుమార్ భట్టిప్రోలు,
మీరు శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానం వ్రాయడం, అందులోకీ సరళంగా అందరికీ సులభమైన రీతిలో తెలుగు భాషలో వ్రాయ సంకల్పం, పరాభఙట్టారికా అపాంగ వీక్షణీయత మీపై పడటం ...
మొట్టమొదటి ఓం శ్రీమాత్రే నమః అను నామంలో శ్రీ కి మీ వివరణ శైలి (పద విన్యాసం) చదవగానే మీ లక్ష్యం మీ భావం ప్రస్ఫుటంగా వ్యక్తమైంది. ఈ లలితా సహస్ర నామాల మాలికలో ప్రతీ పదం దేనికదే స్వతంత్ర జీవలక్షణం కలవి...
శ్రీరామ జయం! హరిఃఓం శ్రీమాత్రే నమః ...
నమస్కారం అండీ శ్రీమతి విజయ లక్ష్మీ రమేష్ కుమార్ భట్టిప్రోలు ..
పరాభట్టారికా అపాంగ వీక్షణీయత మీపై ఉండటం, మొట్టమొదటి ఓం శ్రీమాత్రే నమః అను నామంలో, శ్రీ కి సమృద్ధి, ముక్తి అనే మీ వివరణ శైలి పద విన్యాసం చదవగానే మీ లక్ష్యం మీ భావ వ్యక్తీకరణ నాకు ఓ గని, ఓ నిధి దొరికింది అని గొప్ప సంతృప్తి కలిగింది.
అనునయపు నడక, శ్లోకం 15 లో స్తనభార దళన్మధ్య మాయను, అదే ఆధారంగా మూడు ముడతలలో ముజ్జగములను నిక్షిప్తం చేయు ప్రక్రియ, శ్లోకం 23 లో సుధాసాగర మధ్యస్త న మణిద్వీప నివాసినిని ఆవిష్కరించిన వైనం అద్భుతంగా ఉంది.
డెబ్భై రెండవ శ్లోకం లో రమా రాకేందు సాక్షిగా రతి రూపాన్ని ఆవిష్కరించి అర్థనారీశ్వర తత్వం ప్రతిపాదించిన అద్వైతం, నూటనలబై ఒకటి లో చిత్కళా అంటూ జీవులలో ఉండు జీవం
నా అంశయే, చైతన్య శక్తి ని అనుగ్రహించి ఆపై మిథ్యా జగత్తు కు ముక్తి తానై లయలాస్యం సాక్షాత్త్కరింపజేసిన మీ పాండిత్యం అజరామరం.
మీ భట్టిప్రోలు వంశవృక్షంలో ఈ వ్యాఖ్యానం శిఖరాగ్రంమై వెలుగొందుతూ చిరస్థాయిగా నిలిచిపోనుంది.
చాలా బాగుంది. చాలా సంతోషం మీ ఈ కృషికి అభినందనలు. జగద్జననీ దివ్య ఆశీస్సులు. శుభమస్తు!! శుభం!!
మీ ఆత్మీయ భగద్భంధువులు, శ్రీమాన్ ప్రభాకర రామానుజ స్వామి
9133802229 , హిల్కౌంటీ, మియాపూర్
నమస్కారం ప్రభాకరం గారూ. మీ అభిమానానికీ, ఆశీర్వచనాలకూ కృతజ్ఞతలు. మీ కామెంట్స్ మీ జిజ్ఞాసను తెలియచేస్తున్నాయి. 🙏
రిప్లయితొలగించండి