శ్రీమతి ఉమాదేవి గారి అభిప్రాయం
శ్రీమతి విజయ లక్ష్మి గారికి,
నమస్కారములతో,
మీరు వ్రాస్తున్న లలితా సహస్ర నామ వివరణ మొదటి నుంచి చాలా ఆసక్తిగా చదువుతున్నాను. నాకు చాలా నచ్చింది. మా ఫ్రెండ్స్ కి కూడా ప్రతి రోజు నేను చదివిన వెంటనే పంపుతున్నాను.
ఆ అమ్మవారి అనుగ్రహానికి పాత్రులగు దగు వారు చదువుతున్నారు. అమ్మవారి ప్రతీ నామ వివరణ కూడా పండిత పామర జనకంగా అనిపించింది నాకు. మీ వివరణతో ఎన్నో తెలియని విషయాలు తెలిసాయి. వాగ్దేవతలు, కళలు, కావ్యాలు, తంత్ర విద్యలు, షోడశీ విద్యలు, తిధి నిత్యాది దేవతలు మొదలగు వాటి గురించి తెలిసింది.
శ్రీ లలిత అమ్మవారు ఎలా ఉంటుంది, ఎక్కడెక్కడ ఉంటుంది, ఏ రూపాలలో ఉంటుంది, ఆ మాత శక్తి ఎలా ఉంటుంది, మనం అమ్మ వారిని ఎలా ధ్యానించాలి, అనుగ్రహం ఎలా పొందాలి, దుష్ట శిక్షణ ఎలా చేసింది, అమ్మవారిని ఎలా పూజించాలి, ఏ పువ్వులతో, ఏ పదార్థాలతో, ఏ ఏ వేళలో పూజిస్తే అమ్మ ప్రసన్నురాలవుతుంది, అనే విషయాలని విపులంగా విశదీకరించారు. అంతే కాకుండా శ్రీ భాస్కర రాయల వారి గురించి మాకు తెలియచెప్పారు. గత ఆరు మాసాలుగా ఆనందంతో కూడిన శ్రమతో మా కందరికి ఆధ్యాత్మిక విందు చేశారు. మీకు నా కృతజ్ఞతలు.
మూడున్నర సంవత్సరాల క్రితం, నా మానస సరోవరం యాత్రలో మీ పరిచయం కలిగినందుకు చాలా ఆనందం గా ఉంది. అప్పుడు మీ గురించి గానీ, మీ ఆధ్యాత్మిక వికాసం గురించి గానీ, అంతగా తెలియదు. తరువాత ఒక సంవత్సరం నుంచీ, మళ్ళీ అనుకోకుండా మనం కలవడం ముదావహం. మీ జ్ఞాపకాల దొంతర రచనల ద్వారా, మీది చిన్నతనం నుంచీ ఆధ్యాత్మిక నేపథ్యం ఉన్న కటుంబమని తెలిసి చాలా సంతోషం కలిగింది. ఇక మీ ప్రయాణోపనిషత్ రచనల ద్వారా మీరు దర్శించిన పుణ్యతీర్థాలు, పుణ్యక్షేత్రాలు, ఇంకా తెలియని అనేక విషయాలు తెలిసాయి.
ఆ తరువాత కూడా మీరు మీ ఇంట్లో వికసించిన బ్రహ్మ కమలం photos, హోమం photos etc. నాకు పంపుతూ మన పరిచయం కొనసాగడానికి సహకరించారు. చివరిగా, మీకు, మీ లలితా సహస్ర నామ వివరణను ప్రచురించే ఉద్దేశ్యం ఉంటే అందులో నాకు కూడా భాగస్వామ్యం కలిగించమని కోరుతున్నాను. ఎంతయినా పుస్తకం పుస్తకమే కదా. ఎంత technology ఉన్నా.
రమేష్ గారికి నా నమస్కారములు తెలుపగలరు.
--------------------ఉమాదేవి
ఉమా,
రిప్లయితొలగించండిమీరు పంపిన కామెంట్స్ చాలా బాగున్నాయి.
మీరు అమ్మవారి భక్తులు అని తెలిసే మీకూ షేర్ చేశా.
🙏