శ్రీమతి నండూరి సువర్చలాదేవి గారి అభినందన
అమ్మలగన్న అమ్మ, శ్రీమాత ప్రేరణతో శ్రీలలితా సహస్రనామాల రహస్యవివరణ వ్రాసింది విజయలక్ష్మి. ఈ వివరణ జలపాతంలా, అందంగా, సరళంగా సాగింది. ఇక దీనికి పరిచయవాక్యాలు వ్రాయబూనటం సాహసమే. ఇటువంటి భగవత్ స్తోత్రాలు, భాష్యం చదవాలనుకునే భక్తులకు ఈ ముందు మాటలు అవసరం లేదు.
జీవన సరళి కర్మతో ప్రారంభం అవుతుంది. కర్మల వలన కలిగే సుఖదుఃఖానుభూతులన్నీ భక్తిని ప్రేరేపిస్తాయి. కర్మ ద్వారా, భక్తి ద్వారా, ఉపాసనను ఎంచుకుంటాము. కర్మ, భక్తి, ఉపాసనలు జ్ఞానం కోసం తపింపచేస్తాయి. జ్ఞానతపన భాష్యాలను, వ్యాఖ్యానాలను చదివింపచేస్తుంది.
శ్రీలలితావిజయం చదువరులకు ఆ జ్ఞానతపనకు పునాదులు వేస్తుంది అనటానికి సందేహం లేదు. శ్రీమతి విజయలక్ష్మి "విభుద జనుల వలన విన్నంత కన్నంత తెలియ వచ్చినంత తేటపఱతు", అన్నంతగా తన సాధన, అనుభవాల మేళవింపుతో అతిసరళంగా, సహజంగా,
ధారగా, అత్యంత మధురంగా వ్రాసింది.
ఎంతని వ్రాయను, ఏమని పొగడుదు, శ్రీ లలితావిజయం వివరణ విశేషం. ఏమి వ్రాసినా, ఎంత
వ్రాసినా తక్కువే. చదివి, మననం చేసి, అనుభవాలు పొందగలగటం అమ్మ అనుగ్రహమే. ఈ పుస్తకం అందరికీ అమ్మ అనుగ్రహం ప్రసాదిస్తుందని నమ్ముతున్నాను.
-------------నండూరి సువర్చల
అత్తయ్యా,
రిప్లయితొలగించండియధా శిఖా మయూరాణామ్,
నాగానామ్ మణయో యధా,
తద్వద్వేదాంగ శాస్త్రాణామ్,
గణితం మూర్ధనిస్థిత మ్.
అని ఇన్నేళ్ళూ నా క్లాసుల్లో, మా Mathematics Student Teachers కి చెప్పా. ఇప్పుడు ఇదే భావంతో, నీకు చెప్తున్నా.
నెమళ్ళకి పింఛము, నాగులకి మణులు, ఎలా తలమాణికాలో, అలా నీ అభినందన నాకు తలమానికం.
తవ అభినందనం మమ మూర్ధనిస్థితం.
🙏🙏🙏