18, జనవరి 2022, మంగళవారం

శ్రీమతి తెన్నేటి అమృతవల్లి గారి అభిప్రాయం

 శ్రీమతి తెన్నేటి అమృతవల్లి గారి అభిప్రాయం

ఓం శ్రీమాత్రేనమః.  

అభిప్రాయాలు చెప్పే అంత జ్ఞానం లేదు కానీ, నువ్వు ప్రతి నామానికి అందించిన ఈ విశ్లేషణలు  చదువుతునంత సేపు నన్ను నేనే మర్చిపోతాను. ఇలా మాకు అందించాలి అనే సంకల్పం కలగటం, నిజంగా అది మా అదృష్టం. ఎన్నిసార్లు చదివినా పారాయణ చేసేటప్పుడు మళ్ళీ అర్ధం చదువుతాను. నీ అపారమైన జ్ఞానశక్తికి నిజంగా నా ధన్యవాదాలు.      

ఆ జ్ఞానజ్ఞేయస్వరూపిణి నీయందు  ఇలాగే వుండి, ఇంకా ఎన్నో మాకు అందచేయగలవని, ఆ తల్లి కరుణతో రాయాలి, అని మా ప్రార్ధన. నీకు తప్పకుండా ఆ తల్లి ఆశీర్వాదం ఉంటుంది.   

నీకు ఏ ఆటంకమూ లేకుండా నీ  వెనకాల నిలబడి సహాయ సహకారాలు అందిస్తున్న,  శ్రీ రమేష్ గారికి, నా హృదయపూర్వక ధన్యవాదాలు. 

ఆ లలితా త్రిపుర సుందరికి నా శతకోటి నమస్కారములు. నీకు ఆ సంకల్పము, నీకలమునకు ఆ శక్తి, ఇవ్వాలి అని మనఃస్ఫూర్తి గా కోరుకుంటున్నాను. 

🙏🙏🙏🙏🙏🙏

తెన్నేటి అమృతవల్లి

1 కామెంట్‌:

  1. అక్కా, నీ అభిమానానికి థాంక్స్. నువ్వు ఎంత భక్తిగా అమ్మవారిని కొలుస్తావో నాకు తెలుసు. నీ భక్తిశ్రద్ధలకు అమ్మవారే ఈ వ్యాఖ్యానం నీకు చేరేలా చేసి ఉంటుంది.
    నీ కామెంట్స్ చాలా బాగున్నాయి.
    శ్రీమాత్రే నమః 🙏

    రిప్లయితొలగించండి