శ్రీమతి సునీత గారి అభిప్రాయం
మీరు అద్భుతంగా వ్రాస్తున్నారు, ప్రతి నామాన్ని విపులంగా వివరించిన విధానం,
మీకు పురాణాలు, ఇతిహాసాలు మొదలైన వాటిపై ఎంత లోతైన పరిజ్ఞానం ఉందో చూపిస్తుంది.
మన మానససరోవర్ యాత్ర నుండి, నేను అడిగిన చాలా సందేహాలను మీరు ఉదాహరణలతో నివృత్తి చేసారు. అవన్నీ ఫోన్ కాల్‌లలో లేదా మనము కలిసినప్పుడల్లా. ఆ చర్చలలో నాకు కలిగిన మరిన్ని ప్రశ్నలకు మీ అనుభవాలతో ప్రస్తుత తరానికి సరిపోయే సమాధానాలు ఇచ్చారు.
ఈ నామాలన్నింటినీ, సందేహాలు తలెత్తకుండా, మీరు సరళమైన భాషలో మరియు సమగ్రమైన వివరణలతో రాసారు, ఎక్కడా పక్కదారి పట్టలేదు. అందుచేత నాకు ఎలాంటి ప్రశ్నలు, సందేహాలు రాలేదు.
రోజూ నేను నామాలు చదువుతున్నప్పుడు, మీరు వాయిస్ ఇస్తున్నట్లు అనిపించింది. మీరు నా పక్కన నిలబడి వివరిస్తునట్టు ఉంది. అర్ధం తెలియక, ఇన్ని రోజులు లలితా సహస్రనామం చదివాను, కానీ మీ శ్రీ లలితా విజయం చదవడం మొదలుపెట్టాక, నా మనసుకి అర్ధం తెలిసి, అమ్మవారిని చూసిన అనుభూతి పొందుతున్నాను.
ఉదాహరణకు: అమ్మవారి కళ్ళు, ముక్కు, చీర, గజ్జల సవ్వడి మొదలైనవి మరియు లలితా దేవి యొక్క అందమైన ముఖం కనిపిస్తుంది.
ఈ మధ్యలో చాలామంది, ఒక దేవుడిని పూజిస్తూ ఇంకో దేవుడిని ఫాలో అయ్యే వాళ్ళని ఏదో ఒకటి అంటున్నారు. అలా కాకుండా అందరూ ఒకటే, అందరు అమ్మ స్వరూపాలే, అని చాలా బాగా చెప్పారు.
ఈ స్తోత్రాల అర్థం తెలిశాక చదవడంలోని మాధుర్యం చాల నచ్చింది. నేను ఇతర స్తోత్రాలను కూడా ఈ విధంగా అర్థం తెలుసుకొని చదవడం ప్రారంభించాను.
-------- సునీత దొంత
Thanks Sunita, for your heartful oponion.
రిప్లయితొలగించండిశ్రీ లలితా మాత్రే నమః,మీరు రాసిన లలితా సహస్రనామవ్యాఖ్యానంమాలాంటి పామరులకు కూడా అర్థమయ్యేలా చాలా సరళంగా రాసేరు.నేను రోజూ చదువుతుంటే అమ్మవారు న నా ఎదురుగా వునదా అన్నట్టు వుండేది,ప్రతి నామాన్ని చక్కగా వివరించారు. మీ మా లాంటి వాళ్లకోసం రాయడానికి తీసుకున్న శ్రమకి జోహార్లు. ఇంత కంటేనేను నాకు చెప్పాలో తెలియదు, మీ కుటుంబానికి ఆ చల్లని తల్లి ఆశీసులు వుండాలని సవినయంగా ప్రార్ధిస్తున్నాను,,,,,,🙏🙏🙏🙏
రిప్లయితొలగించండి