శ్రీమతి లోకా అపర్ణ గారి అభిప్రాయం
నా జీవితం లో నేను ఒక రోల్ మోడల్ గారు భావించే విజయలక్ష్మి మేడం గారికి పాదాభి వందనాలు.
నేను మీరు చేసిన ఈ అద్భుతమైన లలిత సహస్రనామ వివరణను గురించి మాట్లాడే స్థాయికి
ఎదగలేదు. నా అభిప్రాయాన్ని తెలియచేస్తున్నాను, తప్పులుంటే మన్నించగలరు. మీ వివరణ పెద్దగా భాషా జ్ఞానం లేనివాళ్లకు కూడా అర్థం అయ్యే విధంగా సరళంగా ఉంది. సరళంగా ఉండటం తో పాటు, భాష అందాన్ని కూడా తగ్గకుండా, ఎంతో అద్భుతంగా వివరించారు. మీ ప్రతి పనిలో సంపూర్ణమైన సాధికారత చూపుతూ, వివరణ ప్రారంభం, మధ్యమం, సమాప్తం అన్నిటిలోనూ
మీకంటూ వైవిధ్యమైన శైలి ఉండి, మీ కష్టం తెలుస్తోంది. మీరు మనసు పెట్టి చేశారు.
ఆ లలితా పరాభట్టారిక మీ తోనే ఉంది. మీ అదృష్టంలో మాకు కూడా భాగాన్ని ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తెలుపుతూ,
మీ అపర్ణ.
మీరు ఈ వివరణ ను పుస్తకీకరణ చేస్తే, భావి తరంలో వారికి కూడా ఉపయోగపడుతుంది మేడం గారు.
🙏🙏🙏
----------------లోకా అపర్ణ
Thanks Aparna,
రిప్లయితొలగించండిFor your love and affection.
😊